మొలతాడును ఎందుకు కట్టుకోవాలి..? పూర్వకాలంలో ఏం జరిగింది..?

పూర్వకాలంలో కొందరు పెట్టిన ఆచారాలను ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు. కానీ ఇదంతా మూఢాచారం అంటూ మరికొందరు కొట్టి పారేస్తున్నారు. అయితే పెద్దలు పెట్టిన ప్రతీ నియమంలో ఒక గూడార్థం దాగి ఉంది. వీటిలో మనం చెప్పుుకోవాల్సిందేంటే మొలతాడు గురించి. ప్రతీ పురుషుడికి నడుముకు మొలతాడు కచ్చితంగా ఉంటుంది. పుట్టిన మొగ పిల్లాడికి 21 రోజుల తరువాత మంచిరోజు చూసి దీనిని కడుతారు. పూర్వకాలంలో ఎక్కువగా దోతులు, లుంగీలు కట్టుకునే వారు. అవి జారిపోకుండా మొలతాడును కట్టుకునేవారని కొందరు చెబుతారు. వాటి స్థానంలో ఇప్పడు బెల్టులు వచ్చాయి. కానీ బెల్టులు వచ్చినా మొలతాడును కచ్చితంగా కడుతున్నారు. దీని వెనుక ఆరోగ్య కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

పురుషులు మొలతాడు కట్టుకుంటే.. మహిళలు వడ్డాణం ధరిస్తారు. అంటే నడుము భాగంలో ఇది కచ్చితంగా ఉండాలన్నమాట. ధర్మశాస్త్రం ప్రకారం మన శరీరం రెండు భాగాలుగా విభజించబడుతుంది. నాభిపైన ఒక భాగం కాగా.. దాని కింద వేళ్ల వరకు మరో భాగం.. మొలతాడు కట్టిన పైభాగం పూజలు, అలంకారం సంబంధించిందని శాస్త్రాల్లో ఉంది. అయితే కేవలం శాస్త్రం ప్రకారంగానే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొలతాడు కట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది. కండరాలు గట్టిపడుతాయి. హెర్నియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయుర్వేదానికి చెందిన వైద్యలు చెబుతున్నారు.

ఒకప్పుడు మెడిసిన్ తక్కువ కాబట్టి ఇలాంటి పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరురుకునేవారు. అందుకే పురుషులు మొలతాడును, మహిళల వడ్డాణం ధరించేలా నియమం పెట్టారు. మొలతాడును ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేవి మాత్రమే కట్టుకుంటారు. అయితే ధర్మశాస్త్ర ప్రకారం వీటిని మంచిరోజుల్లోనే కట్టుకోవాలంటున్నారు. మంగళవారం, శుక్రవారం అస్సలు కట్టుకోకూడదట. బుధవారం, ఆదివారం మాత్రమే కట్టుకోవాలంటున్నారు. ఇక పాత మొలతాడు ఉండగానే దానిపై కొత్త మొలతాడును కట్టుకోవాలి. ఆ తరువాత పాత దాన్ని తీసివేయాలి.

మొలతాడును కొందరు దారం లాంటిది కాకుండా వెండి, బంగారంతో కూడా తయారు చేయించి కట్టుకుంటారు. ఎలా కట్టుకున్న నడుము భాగంలో ఇది ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మంచిదేనంటున్నారు నిపుణులు. అయితే నేటి కాలంలో దీనిని పెద్దగా పట్టిచుకోవడం లేదు. కానీ భారతదేశంలోని చాలా మంది ఈ మొలతాడును తప్పనిసరిగా ధరిస్తారు. శాస్త్రాల పరంగానే కాకుండా ఆరోగ్య కారణాలతోనైనా మొలతాడు ధరించడం మంచిదే. దీని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.

Leave a Comment