Anasuya: తల్లి కాబోతున్న యాంకర్ అనసూయ..!!

అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యాంకర్ అనసూయ మళ్లీ ప్రెగ్నెంటా అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటికే ఇద్దరు బాబులు ఉన్న అనసూయ మళ్లీ ప్రెగ్నెంట్ ఏంటి అంటూ చాలామంది నోరెళ్ళబెడుతున్నారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో అనసూయ కొన్ని చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఆ తర్వాత యాంకర్ గా మారింది. కానీ ఎప్పుడైతే అనసూయ జబర్దస్త్ లోకి అడుగుపెట్టిందో అప్పటినుండి ఆమె దశ తిరిగిపోయింది.

ఆమె జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకొని స్టార్ యాంకర్ గా దూసుకుపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ త్రీ యాంకర్స్ లిస్టులో అనసూయ కూడా ఒకరు. అలాంటి అనసూయ జబర్దస్త్ లో పాపులారిటీ తెచ్చుకున్నాక చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈమె మొదటిసారి రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ పుష్పాలో కూడా అనసూయ విలన్ క్యారెక్టర్ చేసింది.ఇక మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోంది

ఇదిలా ఉంటే సినిమాలో బిజీగా ఉండడంవల్ల జబర్దస్త్ గుడ్ బై చెప్పింది అనసూయ. అయితే తాజాగా అనసూయ  ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రెగ్నెంట్ అంటే నిజంగా అనుకునేరు.. అది కేవలం సినిమా మట్టుకు మాత్రమే. అనసూయ రంగమార్తాండ  అనే సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ,ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రాజశేఖర్ కూతురు శివాత్మిక, అనసూయ,బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే రంగమార్తాండ సినిమాలో అనసూయ గర్భవతిగా కనిపిస్తోంది. అయితే ఆ సినిమాలకి సంబంధించిన ఫోటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రంగమార్తాండ సినిమాలో అనసూయ దేవదాసి అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అనసూయ ఫోటో బయటపడడంతో ఆ పాత్రలో నటించడం లేదని అర్థమవుతుంది. ఈ విషయం పక్కన పెడితే ఈ ఫోటో చూసిన చాలా మంది అనసూయ మళ్లీ ప్రెగ్నెంటా ఆ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు విషయం తెలియడంతో సైలెంట్ అయిపోయారు.

Leave a Comment