Rashmika Mandanna: సింపుల్ గా కనిపిస్తున్న రష్మిక చీర ధర ఎంతో ఊహించగలరా..!

Rashmika Mandanna: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల ముద్దుగుమ్మల్లో రష్మిక మందాన కూడా టాప్ లో ఉన్నారని చెప్పచ్చు.కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ సమయం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.హీరో నాగసౌర్య కు జోడి గా రష్మిక చలో అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత విజయ్ దేవరకొండకు జోడిగా గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.


స్టార్ హీరో మహేష్ బాబు కు జోడిగా సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రష్మిక.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది రష్మిక.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డి గ్లామర్ పాత్రలో నటించి రష్మిక అందరిని ఆకట్టుకుంది.ప్రస్తుతం రష్మిక పుష్ప రెండవ భాగంలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుందని సమాచారం.తెలుగు తో పాటు రష్మిక తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.


ఇటీవలే రష్మిక దళపతి విజయ్ తో కలిసి చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక హిందీ లో కూడా సినిమాలు చేస్తున్న రష్మిక అక్కడ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.తాజాగా రష్మిక తన అసిస్టెంట్ పెళ్ళికి హాజరయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.దంపతులు రష్మిక వచ్చిన ఆనందంలో రష్మిక కాళ్లకు నమస్కరించారు.చూడడానికి సింపుల్ గా ఉన్న చీరలో రష్మిక ఈ పెళ్ళికి హాజరయ్యింది.అయితే ఈ చీర ధర ప్రస్తుతం అందరికి షాక్ కు గురి చేస్తుంది.రష్మిక ధరించిన చీర ధర సుమారు రూ.35 వేలు ఉంటుందని సమాచారం.

Leave a Comment