భారీగా పెరిగిన స్టార్ హీరోల రెమ్యూనరేషన్ : ఒక్కో సినిమాకు ఎంతంటే..?

సినిమా రంగం చాలా పెద్దది. మిగతా రంగాలతో పోలిస్టే ఈ ఇండస్ట్రీలో బడ్జెట్ కోట్లలో మారుతుంది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్లోనే భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు కూడా 100 కోట్లకు తక్కువ కాకుండా సినిమా రూపొందిస్తున్నారు. నేటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రేక్షకులకు కొత్త తరహాలో సినిమాను చూపించేందుకు డైరెక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఒక్కో సమయంలో అంతకుమించి బడ్జెట్ పెట్టినా సినిమా అనుకున్న రేంజ్ లో ఆడడం లేదు. కాని కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దేశీయంగానే కాకుండా వరల్డ్ వైడ్ లెవల్లో మన ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ల రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగింది. వరల్డ్ వైడ్ లెవల్లో ఫ్యాన్స్ ఉన్న స్టార్లకు 100 కోట్లకు తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి 2022 లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలెవరో చూద్దాం..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ బాహుబలి సినిమా తరువాత పెరిగిపోయింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఆదరించడంతో అటు రాజమౌళితో పాటు ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. దీంతో ఆ సినిమా నుంచి ప్రభాస్ రెమ్యూనరేషన్ 100 కోట్ల నుంచి 180 కోట్ల వరకు పెరిగింది.

ఆల్ ఇండియా విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న అమీర్ ఖాన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన ఒక్కో సినిమాకు 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై ఇప్పటికీ ప్రేక్షకుల్లో మోజు తగ్గలేదు. దీంతో ఆయన సినిమా కోసం ఎదురుచూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. దీంతో ఆయన ఒక్కో సినిమాకు 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

బాలీవుడ్ బాద్ షా గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్నాడు.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇప్పిటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు. రోబో సినిమా తరువాత రజనీ రెమ్యూనరేషన్ బాగా పెరిగింది. దీంతో ఆయన ఒక్కో సినిమాకు 60 నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

తమిళ దళపతిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ ఒక్కో సినిమాకు 70 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమారు ఒక్కోసినిమాకు 70 నుంచి 115 కోట్ల రెమ్యూనరేషన్.

అజయ్ దేవ్ గన్ 60 నుంచి 120 కోట్ల వరకు ఒక్కో సినిమా రెమ్యూనరేషన్.

హృతిక్ రోషన్ ఒక్కో సినిమాకు 75 నుంచి 100 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

తమిళ హీరో అజిత్ కుమార్ రెమ్యూనరేషన్ 70 నుంచి 105 కోట్లు.

Leave a Comment