శ్రీదేవి కారణంగా చిరు సినిమా ఆగిపోయింది..: ఆ సినిమా ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను ఆయన నటనతో మెప్పిస్తున్నారు. నేటికీ కొడుకుతో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు. అయితే ఎన్నో కష్టాలు, నష్టాలు పడందే మెగాస్టార్ కు ఆ గుర్తింపు రాలేదు. ఇదే సమయంలో శ్రీదేవి లాంటి హీరోయిన్లు కొందరు చిరంజీవిపై పెత్తనం చెలాయించాలని చూశారని కొందరు చెబుతున్నారు. కానీ మెగాస్టార్ ఎప్పటికీ ఒకరికి లొంగకుండా తన విలువ కాపాడుకున్నారని చెబుతారు. ఈ కారణంగానే చిరంజీవి, శ్రీదేవిలు కలిసి చేయాల్సిన కొన్ని సినిమాలు రద్దయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఆ సినిమాల జోలికి పోలేదు. ఇంతకీ ఆ సినిమాలేవో చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిలు కలిసి చేసిన సినిమా ఏదంటే ఠక్కున గుర్తుకు వస్తుంది ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’. ఆ తరువాత ‘ఎస్పీ పరుశురాం’ సినిమాల్లో కనిపించారు. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రావాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకునేవారు. అటే మేకర్స్ కూడా చిరు, శ్రీదేవి కాంబినేషన్లో సినిమా తీస్తే హిట్టే అన్న భావన ఉండేది. అటు శ్రీదేవికి తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు ఉండేది. ఈ కారణంగా ఆమె నటించే సినిమా అంటే స్టోరీ బాగా లేకపోయినా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందని కొందరు నిర్మాతలు భావించేవారు.

ఈ క్రమంలో శ్రీదేవి సినిమాలో నటించడానికి కొన్ని కండిషన్లు పెట్టేది. శ్రీదేవిని తమ సినిమాలో చూపించాలని ఆ కండిషన్లకు ఒప్పుకునేవారు. అయితే చిరంజీవితో కొన్ని సినిమాలు తీయడానికి కూడా శ్రీదేవి కండిషన్లు పెట్టిందట. చిరు, శ్రీదేవి కాంబినేషన్లో ‘వజ్రాలదొంగ’ అనే సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. కానీ ఈ సినిమాకు శ్రీదేవినే నిర్మాత. అయితే ఇందులో చిరంజీవిని కాకుండా తననే హైలెట్ గా చూపిస్తూ కథను మార్చమని చెప్పిందట. కానీ అప్పటికే సంచలన సినిమాలతో మంచి ఊపుమీదున్న చిరుతో ఇలా చేయించడానికి డైరెక్టర్లు ఒప్పుకోలేదట. అందుకే వజ్రాల దొంగ సినిమా రద్దయిందని అంటుంటారు.

ఇక మెగాస్టార్ సినీ కెరీర్లో ‘కొండవీటి దొంగ’ సినిమా బ్లాక్ బస్టర్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదటగా శ్రీదేవితో చేయించాలని అనుకున్నారట. కానీ ఇక్కడ కూడా శ్రీదేవి హీరో కంటే ఎక్కువ తనకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలన కోరిందట. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ను కొండవీటి రాణిగా మార్చాలని చెప్పిందట. అయితే అందుకు ఒప్పుకోని నిర్మాతలు వెంటనే విజయశాంతి, రాధలను పెట్టి తీశారు. కానీ ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇలా శ్రీదేవి కారణంగా చిరు ఓ సినిమాను నష్టపోయినట్లు ఇండస్ట్రీలో అనుకుంటారు.

Leave a Comment