స్టార్ హీరో కొడుకు నుంచి కృతిశెట్టికి వేధింపులు..?! కన్నీళ్లు పెట్టుకున్న జేజమ్మ..

‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కృతి శెట్టి.. మొదటి సినిమానే సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్ గా మారింది. దీంతో జేజమ్మకు తెలుగులో అవకాశాలు ఇంటితలుపు తట్టాయి. ఆ సినిమా తరువాత నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగర్రాజు’ సినిమాల్లో నటించి హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు రీజెంట్ గా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలోనూ నటించి మెప్పించింది. అందచందాలతో అలరిస్తున్న ఈ భామకు తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ ఇండస్ట్రీలో పాపులారిటీ వచ్చింది. దీంతో తమిళ స్టార్ హీరో విశాల్ లాంటి అగ్రనటులు సైతం కృతితో సినిమాలు చేయాలని ఆరాటపడుతున్నారు. అయితే ఇటీవల ఓ స్టార్ హీరో కొడుకు జేజమ్మను వేధిస్తున్నాడట.. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెబుతూ కన్నీళ్లు పెట్టింది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈమె తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. వరుసబెట్టి ఆఫర్లు రావడంతో కృతి బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇండస్ట్రీలో స్టార్ గా రాణించినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ జేజమ్మకు ఓ స్టార్ హీరో కొడుకు నుంచి వచ్చాయి. సినిమాల్లో బిజీ అయిన ఈ అమ్మడు రీసెంట్ గా నితిన్ తో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తనకు జరిగిన వేధింపుల గురించి మాట్లాడుతూ మీడియా ముందుకు కన్నీరు పెట్టుకుంది.

తమిళ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో కుమారుడు తన బర్త్ డే పార్టీకి రావాలని పదే పదే ఫోన్లు చేస్తున్నాడట. ఖర్చు ఎంతైనా పర్వాలేదు పార్టీకి రావాలని ఫోర్స్ చేస్తున్నాడట. అయితే తనకు అలాంటి అవసరం లేదని చెప్పి సున్నితంగా ఫోన్ కట్ చేసిందట. తాను టాలెంట్ నమ్ముకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని, ప్రతిభ ఆధారంగానే అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. కానీ ఓ స్టార్ హీరో కొడుకు అలా ప్రవర్తించేసరికి షాక్ కు గురయ్యానని తెలిపింది.

అయితే జేజమ్మ చేసిన పనికి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అవకాశాల కోసం ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా ఉన్నందుకు శభాష్ అని అంటున్నారు. మీలాంటి వాళ్లు ఇలా కచ్చితంగా ఉంటేనే ఇండస్ట్రీలో అలాంటి వారి ఆగడాలకు అడ్డు చెప్పొచ్చని కొందరు సపోర్టు చేస్తున్నారు. అయితే ఆయన గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న కృతిశెట్టి అతని పేరు మాత్రం చెప్పడానికి నిరాకరించింది. దీంతో ఆ స్టార్ హీరో కొడుకు ఎవరబ్బా..? అని చర్చించుకుంటున్నారు.

Leave a Comment