పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసుండని స్టార్లు ఎవరో తెలుసా..?

అగ్నిమంటపం చుట్టూ ఏడడుగులు నడిస్తే ఏడు జన్మలు కలిసుంటారని పెళ్లి జరిగేటప్పుడు దీవిస్తారు. కానీ ఈ కాలంలో పెళ్లిళ్లు చేసుకున్నంతసేపు కూడా కలిసి ఉండడం లేదు. ప్రేమించుకుంటారు.. జీవితాంతం కలిసి ఉంటామంటారు.. కానీ సంవత్సరం తిరగకముందే విడాకుల కోసం కోర్టు మెట్లేక్కెస్తారు. ఈ సాంప్రదాయం సినిమాల్లో మరీ ఎక్కువైంది. ఇద్దరు సినీ స్టార్లు పెళ్లి చేసుకుంటున్నారంటే… మళ్లీ ఎప్పుడు విడిపోతారు..? అని కొందరు కొంటె కొశ్చెన్లు వేస్తున్నారు. ఇలా పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన టాలీవుడ్ స్టార్ల గురించి తెలుసుకుంది.

అక్కినేని నాగచైతన్య-సమంత:
‘ఏమాయ చేశావె’ సినిమాలో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్య, సమంతలో ఆ తరువాత ప్రేమలో పడ్డారు. వీరిద్దరు మతాలు వేరైనా పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. కానీ కొంతకాలానికే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో కలిసి ుండలమేని 2021లో విడిపోయారు.

మంచు మనోజ్ -ప్రణతిరెడ్డి:
టాలీవుడ్ యంగ్ హీరో మనోజ్ పెద్దల కుదిర్చిన వివాహమే. అయితే అంతకుముందు ప్రణతితో ప్రేమలో ఉన్నారని తరువాత తెలిసింది. కానీ పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరు పెళ్లి తరువాత కలిసుండలేకపోయారు. కొన్ని విభేదాల కారణంగా ఇద్దరు దూరమయ్యారు.

సుమంత్-కీర్తిరెడ్డి:
ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. ఈ కారణంగా వీరు ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లి చేసుకున్నాక కనీసం రెండేళ్లు కూడా కలిసి ఉండలేదు. కీర్తి రెడ్డి విడాకులు తీసుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సుమంత్ మాత్రం పెళ్లి చేసుకోలేదు.

పవన్ కల్యాణ్-రేణుదేశాయ్:
‘బద్రి’ సినిమాలో కలిసి నటించిన పవన్, రేణుదేశాయ్ ఆ తరువాత ప్రేమలో పడ్డారు. పవన్ తప్ప తనకు సినిమాలు వద్దనుకొని మరే సినిమాలో నటించలేదు రేణు దేశాయ్. అయితే పవన్ అంతకుముందే పెళ్లి అయింది. ఆమెతో విడాకులు తీసుకున్న తరువాతే పెళ్లి చేసుకుంది. కానీ వీరు కూడా కలిసి ఉండలేదు. కొద్దికాలానికే విడాకులు తీసుకున్నారు.

సునీత- కిరణ్:
గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత కిరణ్ ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే కొన్ని విభేదాల కారణంగా కిరణ్ కు విడాకులు ఇచ్చింది సునీత. ఆ తరువాత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది.

Leave a Comment