షేక్ శ్రీను బ్యాక్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..

సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో విలన్లకు కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. ఈరోజుల్లో వచ్చే సినిమాల్లో విలన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. హీరోగా ఎన్నో సక్సెస్ సినిమాలు చేసిన జగపతి బాబు లాంటి వారు విలన్ గా సెటిలయ్యారు. అయితే విలన్ తో పాటు సైడ్ విలన్ ఉండే కొందరిన మనం సినిమాల్లో చూస్తాం.. కానీ వారి గురించి పట్టించుకోం. బాడీ బిల్డింగ్ తో అలరించే వారు ఎంతో కష్టపడితేనే సినిమాల్లోకి వస్తారు. ఎలాంటి బ్యాక్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావడంతో వారు అక్కడే మిగిలిపోతారు. అయితే మిర్చి, జయజయ జానకి లాంటి సినిమాలో ఓ వ్యక్తి సైడ్ విలన్ గా కనిపిస్తారు. ఆయన పేరే షేక్ శ్రీను. ఆయన సినిమాల్లో మాములు వ్యక్తే కావచ్చు. కానీ రియల్ లైఫ్ గురించి తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.

మిర్చి సినిమాలో ప్రభాస్, సంపత్ ఫైట్ సినిమాలో ‘చుక్కలు చూపించండిరా..’ అంటూ డైలాగ్ కొడుతూ ముందుకు వస్తాడే.. అతనే షేక్ శ్రీను. ఆయన అంతకుముందు చాలా సినిమాల్లో కనిపించాడు. కానీ భద్ర సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. షేక్ శ్రీను బ్యాక్రౌండ్ గురించి చూస్తే ఆయనకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ పై ఇంట్రెస్టు పెట్టాడు. బాడీ బిల్డింగ్ లోనేషనల్ అవార్డు కూడా తెచ్చుకున్నాడట. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం వస్తే బాగుండు అనుకున్నాడట. చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా చూసే ఆయన జాకీచాన్, అర్జున్ ను చూశాక ఎలాగైనా సినిమాల్లోకి రావాలని అనుకున్నాడట.

దీంతో సినీ ఆర్టిస్టు ప్రసన్నకుమార్ చొరవతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో షేక్ శ్రీను తెలిపాడు. మొట్టమొదటి సారిగా బాలకృష్ణ నరసింహానాయడు సినిమాలో షేక్ శ్రీను కనిపిస్తాడు. కానీ అందులో చాలా మంది విలన్లు ఉండడం వల్ల షేక్ శ్రీనును గుర్తుపట్టే అవకాశం లేదు. అయతే ఫైట్ మాస్టర్ రామ్ -లక్ష్మణ్ దృష్టిలో పడడంతో అవకాశాలు పెరిగాయి అతనికి. దీతో భద్ర, మిర్చి, జయజయజానకి, ఆప్తుడు వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

వాస్తవానికి షేక్ శ్రీను అసలు పేరు షేక్ రెహమాన్. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పేరును మార్చుకున్నాడు. మరో విశేషమేంటంటే షేక్ శ్రీను పోలీసు విభాగంలో పనిచేస్తున్నాడు. విశాఖపట్నంలోని ఓ స్టేషన్ కు సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఓ వైపు పోలీసు విభాగంలో పనిచేస్తూనే మరో వైపు సినిమాల్లో నటించడంపై చర్చ సాగుతోంది. అయితే సినిమాల్లో విలన్ గా అలరిస్తున్న ఆయన మరెన్ని సినిమాల్లో కనిపిస్తాడో చూడాలి.

Leave a Comment