‘పోకిరి’ని మిస్ చేసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు వరల్డ్ వైడ్ గా దద్దరిల్లాయి. 75 ఏళ్ల సినీ ఇండస్ట్రీ రికార్డును తిరగరాసిన సినిమాగా పేరు తెచ్చుకుంది పోకిరి. వరుస సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ కు ఈ సినిమా మంచి బూస్టు నిచ్చింది. ఇక ఈ సినిమాలో నటించిన మహేశ్ బాబు సైతం మాస్ హీరో అని నిరూపించుకున్నాడు. మహేశ్ బాబు సినీ కెరీర్లో పోకిరి ముందు.. పోకిరి తరువాత అని చెప్పుకుంటారు. హీరోగా వందశాతం న్యాయం చేసిన మహేశ్ బాబుకు జోడిగా ఇలియానా సైతం తన అందచందాలతో ఆకట్టుకుంది. మిగతావారు సైతం తమ పర్ఫామెన్స్ తో రక్తి కట్టించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను మొదట మరో హీరోతో చేయాలనుకున్నాడట పూరి. అయితే కొన్ని కారణాల వల్ల మహేశ్ ను రంగంలోకి దించాడు. ఇంతకీ ఈ సినిమా మిస్ చేసుకున్న నటుడు ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొన్ని మాత్రమే మైలురాయిగా నిలుస్తాయి. అలా ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వచ్చారు సోనూసుద్. మొదట తమిళ ఇండస్ట్రీలోకి కల్లా జాగర్ అనే సినిమాతో 1999లో అడుగుపెట్టారు. ఆ తరువాత తెలుగులో జయసుధ, నాగబాబు నటించిన ‘హ్యాండ్స్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సమయంలో సోనూసుధ్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. అక్కినేని నాగార్జున సినిమా ‘సూపర్’తో ఈ యంగ్ నటుడికి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత అరుంధతి సినిమాతో స్టార్ గుర్తింపు వచ్చింది.

హీర రేంజ్ లో యాక్టింగ్, ఫిజిక్ ఉన్న సోనూ సుధ్ కు ఎక్కువగా విలన్ చాన్సెస్ వచ్చాయి. దీంతో వెనుదిరిగి చూడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అయితే ఒక సందర్భంలో సోనూసుద్ తో సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్, సోనూసుద్ కాంబినేషన్లో సూపర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సోనూ పర్ఫామెన్స్ అదిరిపోయింది. ఇక ఆ తరువాత ఈ యంగ్ నటుడితో కలిసి పోకిరి సినిమా తీద్దామని అనుకున్నాడట పూరి. కానీ ప్రేక్షకుల్లో సోనూసుద్ పై ఎక్కువగా విలన్ ఇంప్రెషన్ ఉంది. దీంతో ఈ టైంలో హీరోగా కరెక్ట్ కాదని అనుకున్నాడు.

సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్న సోనూసుద్ రియల్ హీరో అని పేరు తెచ్చుకున్నాడు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి అందరి ప్రశంసలు పొందాడు. ఇప్పటికే అవసరమైన వారికి సాయం అందిస్తున్నాడు. రీసెంట్లీగా ఆచార్య సినిమాలో కనిపించిన సోనూసుద్ మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పేదలకు అండగా ఉంటున్నాడు.

Leave a Comment