స్పటిక లింగాన్ని ఇలా అభిషేకిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి..

మహాశివుడిని ఆరాధిస్తే తీరని కోరికలు నెరవేరుతాయని అంటుంటారు. శివుడికి అలంకరణ కంటే అభిషేకం చాలా ఇష్టం. అందుకే నిత్యం దేవాలయాల్లో శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో మాత్రం శివుడి చిత్ర పటాలను పెట్టి పూజలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనూ శివలింగాన్ని పూజిస్తే అనేక లాభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శివలింగానికి పూజ చేయాలనుకునేవారు స్పటిక లింగాన్ని తెచ్చుకోవాలని అంటున్నారు. స్పటిక లింగాభిషేకం ద్వారా ఐశ్యర్యంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందట. అయితే ఈ స్పటిక లింగానికి ఎలాంటి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం..

ప్రతీ ఇంట్లో ఏదో కారణం చేత నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. దీనిని తొలగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జ్యోతిష్యలు చెప్పిన ప్రకారంగా ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే శివుడి అనుగ్రహం ఉంటే ఇంట్లోనెగెటివ్ ఎనర్జీ పోతుందటని పండితుతులు చెబుతున్నారు. శివుడి రూపం లింగం. ఈ లింగం స్పటికదైతే ఇంకా ప్రాధాన్యత ఉంటుంది. స్పటిక లింగాన్ని పూజించడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా జీవిస్తారని తెలుపుతున్నారు.

సంపదకు, ఆనందానికి ప్రతిరూపం శివుడి స్పటిక లింగం. ఈ లింగాన్ని రకరకాలుగా పూజలు చేయవచ్చు.స్పటిక లింగాన్ని గరిక గడ్డి ఉంచిన నీటితో అభిషేకిస్తే పోయిన డబ్బు తిరిగి వస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకిస్తే మృత్యు భయం పోతుంది. ఆవుపాలతో అభిషేకిస్తే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. పెరుగుతో చేస్తే బలం, కీర్తి ప్రఖ్యాతలు కలుగుతాయి. చెరుకు రసంతో పూజిస్తే ధనవృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దు:ఖం ఉండదు. మారేడు పత్రాలతో పూజిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. తేనెతో అభిషేకిస్తే ఆయుష్సు పెరుగుతుంది. పూలతో ఉన్న నీటితో చేస్తే భూ లాభం కలుగుతుంది. కొబ్బరి నీళ్లతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి.

ఎల్లప్పుడూ జయాలు కలుగుతూ.. నిత్యం సంతోషంగా ఉండాలంటే శివుడి అనుగ్రహం పొందాలి. అభిషేక ప్రియుడైన శివుడిని ఈ రకంగా పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని పురాణాల్లో ఉంది. కేవలం శివరాత్రి రోజు మాత్రమే కాకుండా వీలైతే ప్రతీ సోమవారి ఇలాంటి అభిషేకాలు చేయడం వల్ల ప్రతిఫలం ఉండొచ్చు. అందువల్ల శివుడి అనుగ్రహం కోసం ఇలాంటి పూజలు చేసి జీవితంలో హాయిగా ఉండండి..

Leave a Comment