శనగలు ఈ పద్ధతి ద్వారా తింటే గుండెకు మేలు..

మార్కెట్లో మనకు నిత్యం శనగలు కనిపిస్తూ ఉంటాయ. అలాగే పూజా కార్యక్రమాల్లో ప్రసాదంగా శనగలను పంచిపెడతారు. అయితే ఇంట్లోకొచ్చేసరికి వీటిని తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే గుప్పెడు శనగలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కొందరు వారానికి ఒకసారి శనగలు తీసుకుంటూ ఉంటారు. కానీ రోజూ తినడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని కొందరు తెలుపుతున్నారు. అయితే వీటిని ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటనే మంచిదంటున్నారు. ఇక మాంసం తిననివారికి శనగలు వరం లాంటివి. ఇవి మాంసం కంటే ఎక్కువగా ప్రొటీన్లు ఇస్తాయట. అయితే శనగలు తీసుకోవడం వల్ల ఇంకెన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..

శనగలు రెండు రకాలుగా ఉంటాయి. ఎర్ర శనగలు.. తెల్ల శనగలు.. తెల్ల శనగలు పెద్దవిగా ఉంటాయి. అయితే ఇంట్లో మాత్రం ఎక్కువగా ఎర్ర శనగలు వాడుతూ ఉంటారు. ఎర్ర శనగలను డైరెక్ట్ గా తినడం కంటే వాటిని నానబెట్టి తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఒకరోజు రాత్రి నానబెట్టిన తరువాత శనగల్లో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా శనగలు నానబెట్టిన నీరు తాగడం కూడా మంచిదేనంటున్నారు. నానబెట్టిన శనగలు గుప్పుడు ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం మంచిదంటున్నారు. ఇలా క్రమ పద్ధతిని తీసుకుంటే గుండు సమస్యల నుంచి దూరంగా ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.

బరువు తగ్గాలనుకునేవారు ఉదయం వ్యాయామం చేసిన తరువాత శనగలు తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేయదు. అదే సమయంలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. దీంతో చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రోజూ తీసుకునే ఆహారంలో తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. జీర్ణ సమస్య ఎక్కువగా ఉన్నవారు శనగలు తీసుకొని ఆహారంతో సమానంగా కేలరీలు పొందవచ్చు.

శనగలు తీసుకోవడం వల్ల అనేక ప్రోటీన్స్ లభిస్తాయి. నానబెట్టిన శనగలు తినడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇవి తినడం వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య పెరగుతుంది. పిల్లలకు శనగలు అల్పాహారం లాగా ఇస్తే వారు రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అలాగే వారానికి ఒకసారి తీసుకునే బదులు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక నిద్రలేమి సమస్య నివారణకు శనగలు మంచి ఆహారంగా చెబుతూ ఉంటారు.

Leave a Comment