బాదం పప్పును పొట్టు తీసేసి మాత్రమే తినాలి..: ఎందుకంటే..?

మనిషి ఆరోగ్యంగా ఉండడానికి రోజూ తీసుకునే ఆహారంలో పప్పు దినుసులు ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్లు ఎక్కువగా లభించి బాదం పప్పును తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పురుషులు వీటని కేవలం 5 గింజలు తీసుకుంటే చాలు.. వారిలో లైంగిక సామర్థ్యం విపరీతంగా పెరుగుతుందని కొందరు ఆయుర్వేద వైద్యలు పేర్కొంటున్నారు. అయితే బాదం పప్పును నేరుగా కాకుండా పొట్టు తీసి తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా వీటిని పొట్టుతో తింటే కొన్ని సమస్యలు ఎదురవుతాయట. వాటి గురించి తెలుసుకుంది.

పప్పు దినుసుల్లో బాదం పప్పు నెంబర్ వన్ స్థానం అని చెప్పుకోవచ్చు. అందుకే వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి. ధర ఎక్కువగా ఉన్నా.. ఇవిచ్చే లాభాలు మాత్రం అధికంగానే ఉన్నాయి. బాదం పప్పుల్లో విటమిన్ ఇ, ఫైబర్, ప్రొటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు కాల్షియం, జింక్, ఫాస్పరస్, మెగ్నిషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఎదిగే పిల్లలకు బాదం పప్పు మంచి ప్రయోజనకారి. ప్రతిరోజూ ఉదయం 5 బాదం గింజలను పిల్లలకు తినిపిస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటూ చదువులో రాణిస్తారు.

బాదం పప్పు తినడం వల్ల కొవ్వు కరిగిపోతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. ఈ గింజలను తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు. వయసు పైబడిన వారు కూడా బాదం పప్పు తినొచ్చు. వీరు కీళ్ల నొప్పుల సమస్య నుంచి బటయపడవచ్చు. ఇక పురుషులు ప్రతి రోజూ 5 బాదం గింజలు తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందట. అంతేకాకుండా వీర్యకణాలు ఎక్కువగా పెరుగుతాయి. బాదం నూనె కూడా ఎంతో మంచిది. ఈ నూనెను రాసుకోవడం వల్ల చర్మం ముడతలు రాకుండా కాపాడుతుంది. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

ఇక బాదం పప్పును కొనుగోలు చేసిన వెంటనే తింటూ ఉంటారు. కానీ అలా తినొద్దని అంటున్నారు. బాదం పప్పును రాత్రి నానబెట్టిన తరువాత ఉదయం వాటి మీదున్న పొట్టును కచ్చితంగా తీయాలంటున్నారు. బాదం పప్పు పొట్టులో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బాదం నుంచి వచ్చే పోషకాలను శరీరానకి అందకుండా చేస్తుంది. అంతేకాకుండా బాదం పప్పును పొట్టుతో తినడం వల్ల త్వరగా జీర్ణం కాదు. పొట్టు తీసేసి తినడం వల్ల్ తేలికగా జీర్ణం అవుతుంది.

Leave a Comment