బంగారు తెలంగాణ అంటే గిదేనా కేసీఆర్ సారూ..

కెసీఆర్ చేసిన వాగ్దానాలకు ఇప్పుడున్న తెలంగాణాకు ఎక్కడ పొంతన లేకుండా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన మద్యం స్వైరవిహారం చేస్తుంది.ఏకంగా కూరగాయలను అమ్మినట్లు మద్యాన్ని అమ్ముతున్న దృశ్యం మీడియాకి చిక్కింది.అది ఇప్పుడు ఏపి, తెలంగాణాలో హాట్ చర్చగా మారింది.వివరాల్లొకి వెళితే.. తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు ఈ ఏడాది ఈ ఏడాది కొత్తగా ఐదు దుకాణాలు మంజూరయ్యాయి.

అయితే, మద్దిరాల మండలానికి గతంలోనే ఓ మద్యం దుకాణం ఉండగా.. కొత్తగా మరొకటి మంజూరు అయింది. అయితే ఈ సారి మద్యం వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎక్కువ ధరకు టెండర్లు దక్కించుకోవాల్సి వచ్చింది. దీంతొ కొందరు వ్యాపారులు సరి కొత్త ఆలోచన చేశారు.ఆదివారం మాత్రం వినూత్న తరహాలో విక్రయాలు చేపట్టారు. మద్యం దుకాణాలదారులే ఓ వాహనంలో మద్యాన్ని తీసుకెళ్లి గ్రామాల్లోని బెల్టుషాపు ఉన్న ప్రతి ఇంటికీ తిరుగుతూ అమ్మకాలు చేశారు. అక్కడ ఆశ్చర్య పడవలసిన విషయం ఏంటంటే..వ్యాపారులు ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడం..ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం తో కామెంట్స్ ఓ రెంజులొ వస్తున్నాయి.. మొత్తానికి జనాలు కెసీఆర్ ను ఏకిపారేస్తున్నారు.

Leave a Comment