బాలయ్య సినిమానా.. మజాకా..

నందమూరి లెజండ్ హీరో బాలకృష్ణ నటించిన సినిమా ‘అఖండ ‘ బాక్సాఫీస్ ను ఎంతగా షేక్ చేసిందో అందరికి తెలుసు.కలెక్షన్లను వసూల్ చేయడం తో పాటుగా మంచి టాక్ ను కూడా సొంతం చేసుకుంది.ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. తన నటనతో మరోసారి బాలకృష్ణ అంటే ఏంటో చూపించారు. కరోనా, ఓటీటీల కారణంగా థియేటర్లకు జనాలు వస్తారో రారో అన్న అనుమానం ప్రొడ్యూసర్లలో ఉండేది..కానీ వారి భయాన్ని తరిమి కోట్టే రితీలొ సినిమా హిట్ అయింది.

మంచి సినిమా పడితే ప్రేక్షకులు వారంతటా వారే చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన సినిమాను చూసేందుకు వస్తారని మరోసారి బాలయ్య నిరూపించారు. కరోనా కారణంగా అంతంత మాత్రంగా నడుస్తున్న థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని అఖండ సినిమాను చూసేందుకు మహిళలు ట్రాక్టర్లలో రావడం విశేషం..ఇది బోయపాటి స్థాయిని మరో మెట్టు పెంచినట్లే..ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Leave a Comment