ఈరోజు బిగ్ బాస్ షో కు ఎంపీ సంతోష్ ఎంట్రీ..

తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. నాలుగు సీజన్లు పూర్తీ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ ను జరుపుకుంటుంది.దాదాపు ఈ సీజన్ కూడా చివరికి చేరుకుంది.ఎంతో మంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు..ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెట్ లో మాత్రమే ఉన్నారు.

ఎప్పటి లాగే శనివారం,ఆదివారం రోజుల్లో నాగార్జున వచ్చి సందడి చేస్తున్నారు.అలాగే ప్రతి ఆదివారం ఒక గెస్ట్ కూడా వస్తారు. అయితే ఈ వారం బిగ్ బాస్ షో కు గెస్ట్ గా టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వస్తున్నారు. ఆది వారం టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ లో ఎంపీ సంతోష్ కుమార్ కనిపించ బోతున్నారని షో ప్రోమో లో చూపిస్తున్నారు.ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో దేశ వ్యాప్తం గా ఫెమస్ అయ్యారు. అందుకనే బిగ్ బాస్ షో లో కి తీసుకురావాలని బిగ్ బాస్ యాజమాన్యం భావించినట్టు సమాచారం. ఈ వారం ఇంటి నుంచి కాజల్ ఎలిమినేట్ అవుథుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Leave a Comment