విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పవన్ దీక్ష..

ఇప్పుడు ఏపీ మొత్తం ఒకటే చర్చ..ఒకటే నినాదం వినిపిస్తోంది.అదే విశాఖ ఉక్కు పరిరక్షణ.ఈ విషయం పై ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ ఉక్కు పరిరక్షణ కోసం సినీ నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌. మంగళ గిరి పట్టనంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష కు కూర్చున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు పవన్.

అలాగే తమిళ నాడు రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన.. అమర వీరులకు నివాళులు అర్పించిన పవన్ దీక్ష కు దిగారు.దీక్ష ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. ఇక ఈ సందర్భంగా నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు..

Leave a Comment