అఖండ సినిమా పై చంద్రబాబు కామెంట్స్..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ హ్యాట్రిక్ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంది.వివిధ పాత్రలలో కనిపించిన బాలయ్య నట విస్వరూపాన్ని చూపించారు. ఇటీవల కాలంలో ఇటువంటి భారీ హిట్ ను అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం..అందుకే ఈ సినిమా పై సామాన్యుల నుంచి సెలెబ్రిటీలు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.. కేవలం తెలుగు రాష్ట్రాలోనే కాదు ఇతర దేశాల్లోనూ అఖండ జాతర జరుగుతుంది.ఇక అఖండ సినిమా పై తెలుగు దేశం అధినేత చంద్రబాబు స్పంధించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అఖండ సినిమా లో చూపించారన్నారు.ప్రస్తుతం ఏపి లో ఇప్పుడు ఏమి జరుగుతుందో అఖండ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు అని అన్నారు. అలాగే అఖండ సినిమా చాలా బాగుందని కొనియాడారు చంద్రబాబు. చిత్రయూనిట్ కు అబినందనలు తెలిపారు చంద్రబాబు..ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది…

Leave a Comment