వామ్మో.. ఇతని అరాచకం మాములుగా లేదుగా..

ప్రస్తుతం చాలా మంది సినిమాల పై అభిమానంతో అలానే నటించడం చేస్తారు.. విషయానికొస్తే ఇటీవల తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకున్న సినిమా పుష్ప..ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు జనాలను ఎంతగా అలరించాయో అందరికి తెలుసు.ఆ పాటలకు వారికి నచ్చినట్లు స్టెప్పులు వేస్తూ   క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ కూడా పుష్ప లాగా చేసి అందరి మనసును దొచుకున్నారు..

అతనే డేవిడ్ వార్నర్‌కి, టాలీవుడ్‌కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలకు సంబంధించి డేవిడ్ భాయ్ చేసిన టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపడంతో పాటు ఎంతో వైరల్ అయిన సంగతి తెలిసిందే..ఇప్పుడు పుష్పలో సూపర్ హిట్ అయిన ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ పాటకు సంబంధించి డేవిడ్ వార్నర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

ఫేస్ యాప్ సాయంతో అల్లు అర్జున్ బదులు డేవిడ్ వార్నర్ ఫేస్ ఉన్న వీడియోను వార్నర్ పోస్ట్ చేయగా.. దాని కింద విరాట్ ‘మిత్రమా.. బానే ఉన్నావా?’ అని కామెంట్ చేశాడు. పక్కన పగలబడి నవ్వుతున్న ఎమోజీ కూడా ఉండటంతో అందరినీ నవ్విస్తుంది.. ఎంత ఫన్నిగా ఉందో మీరు ఒకసారి చూసేయండి..

https://www.instagram.com/tv/CXVv7sbJU1X/?utm_source=ig_web_copy_link

Leave a Comment