మళ్ళీ వంటలక్కగా మారిన దీప..కంటతడి పెట్టిన కార్తీక్..

కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది..వేరే బస్తీ కి వచ్చిన కార్తీక్ దీప లకు అక్కడ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.అవన్నీ పక్కన పెట్టి ఒక ఇంట్లో ఉంటారు.ఇక కార్తీక్ కు ఇలాంటి పరిస్థితి రావడం వల్ల సౌందర్య అదే తలుచుకుని బాధ పడుతుంది.అప్పుడే ఆనందరావు, ఆదిత్య వచ్చి కార్తీక్ గురించి మాట్లాడుతుంటారు. వెతికే పనిలో ఉన్నాము అంటారు. ఇక సౌందర్య ఎలాగైనా పెద్దోడిని చూడాలి అంటూ బాధపడుతుంది.

తర్వాత రోజు సౌందర్య బస్తీ దగ్గరికి వెళ్లి అక్కడ దీప, కార్తీక్ ల గురించి వాళ్లను అడుగుతుంది. దీప వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అంటూ చెప్పండి అంటూ వాళ్లను బతిమాలుతోంది. వాళ్లు కూడా మాకు తెలీదు అనేసరికి బాధపడుతుంది. ఇక వారణాసి దీప ఇల్లు కడతానన్న విషయాన్ని చెబుతూ బాధపడతాడు..ఈ సీన్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

కట్ చేస్తె.. అక్కడ కార్తీక్ డాక్టర్ అనే విషయం బయట పడుతుంది.దీప మాటకు కార్తీక్ బాధపడతారు.వారికి ఇల్లు గడవడానికి ఏదొక పని చేయ్యాలని అనుకుంటారు. తరువాయి భాగం లో దీప తన వంట వృత్తిని మొదలు పెడుతుంది. ఓ చోట మధ్యాహ్న భోజనంలో ఉద్యోగానికి దిగుతుంది. కార్తీక్  తన పిల్లలతో మీ డాడీ డాక్టర్ కాదని మరోచోట పనిచేస్తున్నాడని అందరికీ అలాగే చెప్పమని అనటంతో పిల్లలు ఏడుస్తారు.. మరి సోమవారం ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి..

Leave a Comment