ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ జనాలను ఎంతగా అలరించాయో అందరికి తెలుసు. ఈ సినిమా కు వస్తున్న రెస్పాన్స్ మరో హైప్ ను క్రియేట్ చేస్తుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. సమంత స్పెషల్ సాంగ్ లో  నటించింది.ఊ అంటావా? ఊ ఊ అంటావా?’ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. స్పెషల్ సాంగ్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే దేవి శ్రీ ప్రసాద్ డిఫరెంట్ ట్యూన్‌తో వచ్చారు. తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాయగా… ఇంద్రవతి చౌహన్ ఆలపించారు. తమిళంలో ఇదే పాటను సింగర్ అండ్ హీరోయిన్ ఆండ్రియా ఆలపించారు.

కన్నడలో తెలుగమ్మాయి మంగ్లీ పాడారు. మలయాళంలో రమ్యా నంబీశన్ పాడారు. ఒక్కో భాషలో ఒకొక్కరి చేత దేవిశ్రీ పాటను పాడించారు.తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ధనుంజయ తదితరులు సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here