మోనిత కు పోటీ ఇస్తున్న రుద్రాణి.. ఈరోజు ఎపిసోడ్ లో..

కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కార్తీక్ చేసిన చిన్న తప్పు వల్ల ఈరోజు అందరూ రోడ్డున పడ్డారు.ఏకంగా ఊరి వెళ్ళి పోతారు.అలా అయినవాల్లను పక్కన పెట్టి భార్యాబిడ్డల్ని తీసుకెళ్లిన కార్తీక్ ను తలచుకుని తల్లి బొరున ఏడుస్తోంది.

ఈ విషయం కాస్త ఎమొషనల్ గా సాగుతోంది..దీప ఉన్నంత వరకూ వాడు గెలుస్తూనే ఉంటాడు.. దీప వాడ్ని ఓడిపోనివ్వదు’ అంటూ ఆనందరావు సౌందర్యని ఓదారుస్తూ ఉంటాడు. ‘కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన’ అంటూ పాట వస్తూ ఉంటే.. కార్తీక్ రాయి తగిలిపడబోతాడు. దీప కార్తీక్‌ని పట్టుకుంటుంది. ఇలా వారిద్దరి మధ్య జరిగిన సన్నీవేశాలను గుర్తు చెసుకుంటారు..

కట్ చేస్తె.. మోనిత ఇంట్లోకి వస్తుంది. ఇదంతా జరగడానికి మోనిత కారణం అని అందరూ కోపంగా ఉంటారు. దాంతో మోనిత అక్కడ నుంచి వెళ్ళిపోయింది.మొత్తానికి దీప ఓ ఇంట్లో వుండటానికి సిద్దం చెసుకుంటారు. రేపటి ఎపిసోడ్ లో దీప రుద్రాణి ఇంటికి వెళుతూంది.దీప ఆ ఇంటి గేట్ తీస్తుంటే.. కూర్చీలో కూర్చున్న రుద్రాణిని ఓ భయంకరమైన మ్యూజిక్‌తో ప్రేక్షకులకు పరిచయం చేస్తారు డైరెక్టర్. దీప ఆమె దగ్గరకు వెళ్లి.. ‘నమస్తే నండి.. నా పేరు దీప.. మేము ఈ ఊరుకి కొత్తగా వచ్చాం.. ఆ ఖాళీ ఇంట్లో..’ అంటూ దీప అడగడం పూర్తి కాకుండా.. ‘నా గురించి తెలిసే వచ్చావా?’ అంటుంది ఆ రుద్రాణి.. ఇక వీరిద్దరికి స్నేహం ఏర్పడుతుందా? శత్రుత్వం ఏర్పడుతుందా అనేది చూడాలి..

Leave a Comment