ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో అదే హైలెట్..

రాజమౌలి రూపొందింస్తున్న భారీ బడ్జెట్ సినిమా త్రిపుల్ ఆర్.. జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతుండగా, కొద్ది సేపటి క్రితం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి.

చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నంగా ఆర్ఆర్ఆర్ సినిమాని తీసారు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించారు.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా కు మంచి హైప్ గా నిలిచింది.తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అలాగే అగ్రరాజ్యం అయిన అమెరికాలో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. అక్కడ ఉన్న మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ గ్రాండ్ రిలీజ్ కానుందని సమాచారం.. ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తూన్న కల మొత్తానికి త్వరలో నెరవేరబోతుంధి..ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ట్రైలర్ ను మీరు ఒకసారి చూడండి..

Leave a Comment