శ్రావణమాసంలో ఇవి అస్సలు చేయకూడదు…: ఎందుకంటే..?

ప్రతీ సంవత్సరం వచ్చే శ్రావణమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం కోసం ఆధ్యాత్మికవాదులు ఎదురుచూస్తూ ఉంటారు. పూజలు, వ్రతాలు చేసుకోవడానికి ఈ మాసం ఎంతో అనువుగా ఉంటుంది. మంచి చేస్తే మంచే జరుగుతుంది.. అని భావంచే కొందరు శ్రావణమాసం మొత్తం నిష్టతో ఉంటారు. అవసరమైన ఉపవాసాలు చేసి భక్తి శ్రద్ధలతో దేవుడిని కొలుస్తారు. శ్రావణమాసం శివునికి ప్రీతిపాత్రమైనదని అంటారు. ఈ మాసంలో ప్రతి ఒక్కరు చేసే పనిని శివుడు గమనిస్తాడని భక్తుల నమ్మకం. అయితే శ్రావణమాసంలో ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?

ఆషాఢం తరువాత వచ్చే శ్రావణ మాసం పూజలు వ్రతాలతో గడిచిపోతుంది. శ్రావణ మొదటి శుక్రవారం మహిళలు ఎంతో ఇష్టంగా పూజలు చేస్తారు. అలాగే సోమవారం శివునికి అభిషేకాలు నిర్వహించి ఆరాధిస్తారు. ఇలా ప్రతీ రోజును పండుగలా నిర్వహించుకుంటారు. అయితే శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు చేయాలనుకునేవారు కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ మాసంలో ఎక్కువగా లక్ష్మీ దేవత సంచరిస్తూ ఉంటుంది. లక్ష్మీ అంటే పరిశుభ్రతకు మారుపేరు. ఎక్కడ నీట్ నెస్ ఉంటుందో అక్కడ ఈ దేవత ఉంటుందని కొందరి నమ్మకం. అలాగే శ్రావణంలో లక్ష్మీ వరలక్ష్మిగా మారుతుంది. వరాలిచ్చే దేవతగా ప్రతి ఇంట్లో కొలువై ఉంటుంది. ఎవరైతే నిష్టగా వరలక్ష్మి వ్రతాలు చేసి.. అమ్మవారిని కొలుస్తారో వారికి అనుగ్రహిస్తుందని అంటుంటారు.

అయితే శ్రావణమాసం మొదలు కాకముందే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. శ్రావణం మొదలయ్యాక చెత్తాచెదారం ఉండడం వల్ల ఎలాంటి శుభాలు జరగవు. అలాగే పొరపాటున కూడా మాంసాన్ని ఇంట్లోకి తీసుకురాకండి. వీటిని ఇంట్లోకి తెస్తే శివుడు ఆగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. ఇక ఈ నెలలో నూనెతో బాడీ మసాజ్ చేయించుకోవద్దట. పురుషులు మద్యం సేవించడం కంటే సాధారణ పానీయాలే తీసుకోవాలట. ఇక ఈ మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి తీసుకోవద్దని అంటున్నారు.

రాగిపాత్రలో నీరు తాగితే మంచిదని అంటుంటారు. కొందరు శుభప్రదమని ఈ మాసంలోనే రాగి వస్తువులు ఇంట్లోకి తీసుకొస్తారు. కానీ రాగికి సంబంధించిన ఏ వస్తువైనా ఈ నెలలో తీసుకోకపోవడం మంచింది. ఇక శివునిని ఆరాధించే భక్తులు తులసి ఆకులను ఈ మాసంలో అస్సలు సమర్పించకూడదట. పెరుగు, నెయ్యివంటి వాటితో అభిషేకం చేసినా సమాన ఫలితాలు ఉంటాయంటున్నారు.

Leave a Comment