రాఖీ పౌర్ణమి రోజు ఈ నియమాలు తప్పకుండా పాటించండి..: లేదంటే..?

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. అనుకుంటూ ప్రతీ చెల్లి తన అన్నకు.. ప్రతీ అక్క తన తమ్మునికి రాఖీ కడుతూ అంటుంది. అంటే ఒకే కడుపున పుట్టిన మనమిద్దరం జీవితకాలం కలిసుండాలని అనుకుంటుంది. ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో రాఖీ పండుగ వస్తుంది. ఈ పండుగ వచ్చే మూడు రోజుల ముందు నుంచే మహిళలు, యువతులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు రెడీ అవుతారు. దూరపు ప్రయాణాలు చేసేవాళ్లు ముందుగానే వెళ్తారు. ఈ క్రమంలో మార్కెట్లో రాఖీల కొనుగోలుదారులతో బీజీ వాతావరణం ఏర్పడుతుంది. అయితే అందంగా ఉన్నవి కదా.. అని కొందరు ఏవేవో రాఖీలు కొనుగోలు చేస్తుంటారు. రాఖీ కట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిదంటున్నారు. అవేంటంటే..?

నాటి నుంచి నేటి వరకు రాఖీల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంతకాలం కిందట మెరుపులతో కూడిన రాఖీలు వచ్చేవి. అవి ఎక్కువగా ఎల్లోకలర్లోనే ఉండేవి. పసుపు శుభ సూచికానికి అర్థం. అందుకే ఒకప్పుడు వచ్చిన రాఖీల్లో ఎక్కువ శాతం పసుపు కలర్ కచ్చితంగా ఉండేవి. ఆ తరువాత కొంచెం స్టైలిష్ రాఖీలు మార్కెట్లోకి రావడంతో చాలా మంది యువతులు వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలో నల్లని రాఖీలను కూడా కొంటున్నారు. వాస్తవానికి నలుపు రంగు ఉన్న రాఖీలు కొనుగోలు చేయొద్దని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకనే కాకుండా ఇద్దరికీ శుభం కలుగాలని ఆశించి కట్టే రక్షక కవచం. అలాంటి రక్షణ కవచాన్ని నలుపు రంగును కట్టడం అశుభమని అంటున్నారు. అయితే మిగతా ఏ కలర్ అయినా పర్వాలేదు గానీ నలుపు రంగు రాఖీలు కట్టడం భావ్యం కాదని అంటున్నారు.

ఇక కొందరు దేవుని ప్రతిమలు ఉండే రాఖీలను కొనుగోలు చేస్తారు. వాస్తవానికి దేవుని విగ్రహం, లేదా చిత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటప్పుడు దేవునికి సంబంధించిన రాఖీని కట్టడం వల్ల శుభ్రంగా ఉండాలి. కానీ అది కట్టుకున్న వారు ఎప్పటికీ అలా ఉండడం సాధ్యం కాదు. ఇలా చేయడం వల్ల దేవుడని మురికి కూపంలోకి పంపించినట్లవుతుంది. అందువల్ల దేవుని ప్రతిమ ఉన్న రాఖీలను కట్టకుండా జాగ్రత్త పడాలి.

Leave a Comment