మేనరికం పెళ్లిళ్లు చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి..

భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. పురాతన కాలంలో ఇది ఎక్కువగా ఉండేది. బంధువులే బంధుత్వాలను కలుపుకునేవారు. అంటే పెళ్లిళ్ల విషయంలో బయటి వ్యక్తులను కాకుండా దగ్గరివారే ఉండాలని అనుకునేవారు. అయితే రాను రాను మేనరికపు పెళ్లిళ్లు తక్కువైనా అక్కడక్కడా తప్పని పరిస్థితుల్లో జరగుతున్నాయి. కొన్ని అనుకోకుండా జరిగితే..మరికొన్ని అవసరం కోసం జరుగుతున్నాయి. ఇలా మేనరికం పెళ్లిళ్లు చేసుకున్న వారు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. మేనరికం పెళ్లి వలన ఎలాంటి సమస్యలు వస్తాయి..? ఇందులో నిజమెంత..?

వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడుతాయంటారు. కానీ కొందరు తమ కుటుంబ గౌరవాన్ని కాపాడాలని ఇంట్లో ఉండే వాళ్లతోనే మేనరికపు పెళ్లిళ్లు చేస్తారు. తమ మనస్తత్వాలు అందరికీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఆనందంగా ఉంటారని అనుకుంటారు. మరోవైపు తెలిసిన వ్యక్తి కావడంతో అమ్మాయికి కూడా సెక్యూరిటీ ఉంటుందని భావిస్తారు. అయితే ఒకప్పుడు అమ్మాయిలు తల వంచుకొని తాళి కట్టించుకునేవారు. కానీ ఇప్పుడు ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ముఖ్యంగా మేనరికం పెళ్లిళ్లకు అమ్మాయిలు అస్సలు ఒప్పుకోవడం లేదు.

ఒకవేళ కొన్ని కారణాల వల్ల మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్నా కొన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒకరికి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే అది వారసత్వంగా తమ పిల్లలకు, మనువలకు వస్తుంటాయి. ఇలా మూడోతరం వరకు ఆ వ్యాధులు కొనసాగుతాయట. షుగర్, రక్త సంబంధిత వ్యాధులు ఏవైనా ఒకరి నుంచి మరొకరికి కొనసాగుతాయట. మరోవైపు మేనరికం పెళ్లిళ్ల వలన జన్యులోపం ఉంటుందట. క్రమోజోమ్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వస్తాయంటున్నారు.

అయితే దీనికి పరిష్కారం లేదా అంటే ఉందంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే వారికి ఎలాంటి వ్యాధులున్నాయో తెలుసుకోవడం మంచిది. అలాగే ముందుగానే జెనెటిక్ కౌన్సిలర్ ను సంప్రదిస్తే క్రోమోజోములను ఎనలాసిస్ చేసుకోవాలి. ఇక వీరికుంటే ప్రాబ్లమ్స్ నెక్ట్స్ వచ్చే బేబీకి ఎంత ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలి. తీవ్ర ప్రభావం ఉంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. మరో మార్గం హయ్యర్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటే కచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని అంటున్నారు.

Leave a Comment