వెంకీ నటించిన ఈ 10 సినిమలు రీమేక్ అని తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేశ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి సినిమానే సక్సెస్ కావడంతో ఆయనకు విక్టరీ అనే బిరుదు వచ్చింది. ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ ఎలాంటి సినిమాలనైనా వెంకటేశ్ అందులో ఇమిడి పోతాడు. ఇప్పటికే యంగ్ హీరోలకు ధీటుగా ఆయన నటనతో ఆకట్టుకుంటాడు. అయితే వెంకటేశ్ సినీ కెరీర్లో ఎన్నో అద్భుత సినిమాలు చేశాడు. ఫ్యామిలీ సినిమాలు చేసి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించడం వెంకటేశ్ కు మాత్రమే సాధ్యం. ఇక సినీ ఇండస్ట్రలో ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకునే వ్యక్తిగా కూడా పేరొందాడు. వెంకటేశ్ తన నట జీవితంలో ‘చంటి’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో వెంకటేశ్ మాత్రమే ప్రధానంగా కనిపిస్తాడు. ఈ సినిమా స్టోరీ కూడా ఎంతో బాగుంటుంది. అయితే ఈ సినిమా తమిళ రీమేక్ అని కొందరికి మాత్రమే తెలుసు. చంటి మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలను ఇతర ఇండస్ట్రీలో వచ్చిన తరువాత రీమేక్ లో నటించారు. అలాంటి సినిమాల గురించి తెలుసుకుంది.

చంటి:
వెంకటేశ్, మీనా కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. ఈ సినిమాను తమిళ మూవీ నుంచి తీసుకొని రీమేక్ చేశారు. తమిళంలో ‘చిన్న తంబి’ అనే సినిమాను తెలుగులో ‘చంటి’ పేరుతో తీశారు. తమిళంలో ప్రభు, కుష్బు కలిసి నటించారు. తెలుగులో వెంకటేశ్ మీనాతో పాటు నాజర్ తదితరులు నటించారు.

సుందరకాండ:
విక్టరీ వెంకటేశ్ సినీ కెరీర్లో మరో హిట్టు మూవీ సుందరకాండ. ఇందుంలో వెంకీకి జోడిగా మీనా నటించారు. ఇక స్టూడెంట్ పాత్రలో అపర్ణ నటించారు. ఈ సినిమా తమిళంలో ‘సుందరకాండం’ పేరుతో తీశారు. ఇందులో వెంకటేశ్ ప్లేసులో భాగ్యరాజ, మీనా ప్లేసులో భానుప్రియ నటించారు. ఇక అపర్ణ పాత్రలో సింధుజ నటించి మెప్పించారు. ముందు తమిళంలో వచ్చిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.

సూర్యవంశం:
వెంకటేశ్ ద్విపాత్రాభినయంతో వచ్చిన సినిమా సూర్యవంశం. యాక్షన్ తో పాటు సెంటిమెంట్, కామెడీ ఇలా నవరసాలను పండించిన ఈ సినిమా విజయవంతంగా కొనసాగింది. ఈ సినిమా ముందుగానే తమిళంలో తీశారు. అక్కడ శరత్ కుమార్, రాధికలు కలిసి నటించారు. తెలుగులో సంఘవి పాత్రలో దేవయాని నటించారు.

జెమిని:
మాస్ మూవీ హీరోగా వెంకటేశ్ నటించి మెప్పించిన సినిమా జెమిని. అప్పటి వరకు సెంటిమెంట్ చిత్రాల్లో నటించిన వెంకీ ఒక్కాసారిగా యాక్షన్ హీరో అనిపించుకునేందుకు ఈ సినిమాలో నటించారు. అయితే దీనిని తమిళంలో అప్పటికే విక్రమ్ హీరోగా జెమిని పేరుతోనే తీశారు. అక్కడ యావరేజ్ గా నడవగా.. తెలుగులో మాత్రం వెంకటేశ్ నటనతో ఆకట్టుకుంది.

ఘర్షణ:
తమిళంలో సూర్య నటించిన ‘కాకా కాకా’ సినిమా మంచి సక్సెస్ సాధించింది. దీంతో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకొని వెంకటేశ్ కు అవకాశం ఇచ్చారు. వెంకీ తన నటనతో విజృంభించారు.

ఈనాడు:
బాలీవుడ్లో ఎవెన్స్ డే అనే సినిమాను తీశారు. ఇందులో కమలాసన్ కూడా నటించారు. అయితే దీనిని తెలుగులో తీశారు. కమలాసన్ ను డామినేట్ చేసే విధంగా వెంకీ నటించి మెప్పించారు.

గోపాల గోపాల:
‘ఓమై గాడ్’ పేరుతో బాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమాను తెలుగులో ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో వెంకటేశ్ కు తోడుగా పవన్ కల్యాణ్ కూడా నటించారు.

గురు:
హిందీ మాధవన్ నటించిన ‘షాల కాదుస్’ తీసిన దీనిని తమిళంలో కూడా తీశారు. తెలుగులో మాత్రం వెంకటేశ్ నటించి ‘గురు’ పేరుతో వెండితెరపై కనిపించారు.

దృశ్యం:
మలయాళంలో ‘దృశ్యం’ పేరుతో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్ నటించారు. ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్ తో చేయించారు. ఆ తరువాత ఇందులో కమలాసన్ కూడా నటించేందుకు ఆసక్తి చూపారు.

నారప్ప:
తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమాలో తెలుగులో వెంకటేశ్ నటించారు. అయితే ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తీసుంటే ఎంతో బాగుండేదని అనుకున్నారు.

Leave a Comment