హీరోల కంటే విలన్ గా హైలెట్ గా నిలిచిన ఈ 9 సినిమాల గురించి తెలుసా

సినిమాల్లో నటించాలనుకునే వారు ఎవరైనా హీరో కావాలని చూస్తారు. ఎందుకంటే హీరో పాత్రకు మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఆ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది కమెడియన్లు, విలన్లుగా వచ్చిన వారు ఆ తరువాత హీరోలుగా మారారు. అయితే నేటి కాలంలో మాత్రం కొందరు హీరో పాత్ర కంటే విలన్ పాత్రకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో కూడా విలన్ పాత్రలే హైలెట్ గా నిలుస్తున్నాయి. ఒక సినిమాలో స్టార్ హీరో ఉన్నా.. ఆ హీరోకు తగ్గట్టుగా విలన్ పాత్రను సెట్ చేయాల్సి వస్తోంది. విలన్ పాత్రకున్న పరిమితి ఎక్కువ కావడంతో హీరో ని డామినేట్ చేస్తున్నారు. ఇలా కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ మనం గుర్తించలేదు. అలాంటి సినిమాల గురించి తెలుసుకుందాం..

జులాయి:
ఈ సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ నటించారు. ఆ హీరోకున్న క్రేజ్ గురించి తెలియంది కాదు. కానీ ఇందులో మరో స్టార్ నటుడు సోనూసుద్ నటించారు. అయితే ఇందులో బన్నీ కంటే సోనూసుద్ పాత్ర హైలెట్ గా నిలుస్తుంది.

స్పైడర్:
మహేశ్ బాబు నటించిన స్పైడర్ సినిమా సస్పెన్స్ థ్రిల్లింగ్ గా కొనసాగుతుంది. ఇందులో మహేశ్ తో పాటు మరో స్టార్ హీరో ఎస్.జె.సూర్య నటించారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో విలన్ గా ఆయన ఇరగదీశారు. దీంతో మహేశ్ కంటే ఎస్ జె సూర్య నటన హైలెట్ గా నిలిచింది.

ధ్రువ:
మెగా హీరో రామ్ చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమా గురించి తెలిసిందే. ఇందులో మరో సీనియర్ నటుడు అరవింద స్వామి నటించారు. అప్పటి వరకు అరవింద స్వామి క్యూట్ హీరో. కానీ ఈ సినిమాలో కరుడు గట్టిన విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. దీంతో ఇందులో ఆయన పాత్రకు ప్రాధాన్యత పెరిగింది.

మాస్టర్:
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మరో హీరో విజయ్ సేతుపతి నటించారు. విలన్ గా తన ప్రతిభ చూపడంతో సినిమాకు ఆయనే హైలెట్ గా నిలిచారు.

నానిస్ గ్యాంగ్ లీడర్:
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తీకేయ విలన్ గా నటించారు. ఆయన నాని నటనను డ్యామినేట్ చేశారు.

బాహుబలి:
స్టార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిండిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరో స్టార్ హీరో రానా నటించారు. ఇందులో రానా నటన ఆకట్టుకుంటుంది.

వర్షం:
ప్రభాజ్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిన వర్షంలో గోపిచంద్ విలన్ గా నటించారు. ఇందులో ఆయన నటన ఆకట్టుకుంటుంది.

సెవెన్త్ సెన్స్:
స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమాలో విలన్ పాత్ర డానియేల్ డామినేట్ చేస్తుంది.

అభిమన్యుడు:
విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమాలో సీనియర్ హీరో అర్జున్ కూడా నటించారు. ఇందులో విలన్ గా నటించిన అర్జున్ పాత్రే హైలెట్ గా నిలుస్తుంది.

Leave a Comment