ఇదేంది ఇది.. ఓరి నాయనో..

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎవరికైనా జ్వరం వస్తుంది. లేదంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి.కానీ ఓ మహిళకు మాత్రం పూనకమ్ వచ్చింది. అవును మీరు విన్నది నిజమే. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది..వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలోకి ఓమిక్రాన్‌ కేసులు కూడా ఎంటరవడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటీకీ టీకా వేసుకోని మారు మూల ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు ఆరోగ్య సిబ్బంది.

ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. వ్యాక్సిన్‌ వేసేందుకు వెళ్లిన ఆరోగ్య సిబ్బందికి అనుకోని సంఘటన ఎదురైంది.మంచిర్యాల జిల్లాలో వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో వేమనపల్లి మండలం ముల్కలపేటలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ కోసం ఆరోగ్య సిబ్బంది వెళ్లారు. ఈ క్రమంలో రాజక్క అనే మహిళకు వ్యాక్సిన్‌ వేశారు. వెంటనే ఆ మహిళ పూనకం వచ్చినట్టుగా ఊగిపోయింది. దేవుళ్ల పేర్లను పలుకుతూ వింతగా ప్రవర్తించింది. మొత్తానికి ఆమె పిచ్చికి సిబ్బంది చెక్ పెట్టారు.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాల్లొ చక్కర్లు కోడుతుంది…

Leave a Comment