బన్నికి రౌడీ స్పెషల్ గిఫ్ట్.. వావ్

అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన భారీ హిట్ సినిమా పుష్ప..
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పుష్పను రూపొందించారు. మొత్తానికి నిన్న విడుదల అయ్యి ఘన విజయాన్ని సాధించాడు బన్నీ..

ఈ సినిమా సక్సెస్ లో విజయ్ దేవరకొండ కూడా పాలు పంచుకున్నారు. గతం లో కూడా బన్నీ సినిమా సక్సెస్ ను అందుకున్న సందర్భంగా రౌడీ బ్రాండ్స్ ను గిఫ్ట్ గా పంపాడు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు కూడా బన్నిని సర్ ప్రైజ్ మరో గిఫ్ట్ పంపాడు.రౌడీ క్లబ్‌ క్లాతింగ్‌ నుంచి కస్టమైజ్‌డ్‌ చేయించిన బ్లాక్‌ కలర్‌ స్వెట్‌షర్ట్‌ను బన్నీకి బహుమతిగా అందించాడు. ‘రౌడీ లవ్స్‌ అల్లు అర్జున్‌’ అని ప్రత్యేకంగా ప్రింట్‌ చేయించి ఇచ్చాడు. ఇదే షర్ట్‌ను అల్లు అర్జున్‌ పుష్ప సినిమా విడుదలైన సందర్భంగా తన కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లే సమయంలో వేసుకున్నాడు. విజయ్‌ పంపించిన షర్ట్‌తోపాటు, ఆల్‌ ద బెస్ట్‌ చెబుతూ రాసిన చిన్న లెటర్‌ను అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశాడు.అది సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..

Leave a Comment