దారుణం.. హైదరాబాద్ లో మరో ఘోర ప్రమాదం..

హైదరాబాద్లో రోజు రోజుకు మరణాల రేటు పెరుగుతుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల ద్వారా ఎక్కువ మంది చనిపొథున్నారని సర్వేలు చెబుతున్నాయి.. రోజులో నగరంలో ఎక్కడో చోట రోడ్డు ప్రమాదలు జరిగి ప్రాణాలను కొల్పొయారు.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఎక్కువగా గచ్చిబౌలిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈరోజు ఉదయం దారుణం సంఘటన వెలుగు చూసింది.కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సిద్ధును ఆసుపత్రికి తరలించారు. మృతులను జూనియర్ ఆర్టిస్టులు మానస, మానస, కారు డ్రైవర్ అబ్దుల్లాగా గుర్తించారు.వీరిద్దరు అమీర్ పేట్ లో వున్నట్లు పోలీసులు వెల్లదించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Leave a Comment