ఎందుకయ్యా దేవి..ఇది అవసరమా?

పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాకు దేవి మంచి మ్యూజిక్ ను కంపొజ్ చేసాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా కు హైలెట్ దేవి అనే చెప్పాలి. అయితే ఈ సినిమా లోని స్పెషల్ సాంగ్ పై ఇతను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

ఐటమ్ సాంగ్‌లో పదాలను దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. దేవీశ్రీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.. ఇది ఇప్పుడు సినీ వర్గాల్లొ చక్కర్లు కోడుతుంది.ఐటెం సాంగ్స్, దేవుళ్ల పాటలు తన దృష్టిలో ఒక్కటే అని చెప్పడం గమనార్హం. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాట పాడు కానీ హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పాడకూడదు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

Leave a Comment