వామ్మో.. ఇదేం పిచ్చి.. కోడికి బర్త్ డే.. వైరల్..

చాలా మంది జంతువులను తినడం తో పాతుగా వాటిని ప్రేమగా పెంచుకుంటుంటారు.. వాటిని సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. అయితే ఒక్కో సారి పిచ్చి పీక్ లోకి వెళ్ళిపోతుంది. వాటికి ఫోటో షూట్ లని, పుట్టిన రోజు వేడుకలని చేస్తూ జనాలను ఒకింత ఆష్చర్యానికి గురి చేస్తున్నారు.. ఇప్పుడు ఓ మహిళ తానూ ప్రేమగా పెంచుకున్న కోడికి బర్త్ డే చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి..

కోడి చేత కేక్ కోయించి, తినిపించడమే కాదు, ‘చిన్ను’ అని వాళ్లు నోరారా పిలుచుకునే దాన్ని- కోడి అనడాన్ని కూడా సహించడం లేదు ఈ ఫ్యామిలి.మామూలుగానే కోడిని ద్విజుల కేటగిరిలో వేస్తుంటారు. ద్విజులు- అంటే రెండు సార్లు పుట్టిన శ్రేష్టవర్గం అన్నమాట. కోడికి కూడా గుడ్డుగా తొలి జన్మ అయితే, ఆపై గుడ్డు నుంచి పిల్లగా మరో పుట్టుక. అలా రెండు సార్లు పుట్టే కుక్కుటము- అనగా కోడికి, సారీ ‘చిన్ను’కి రెండవ పుట్టినరోజు వేడుకలు జరిపించిందీ కుక్కుట కుటుంబం..

Leave a Comment