ఇంద్రధనస్సులా మెరిసిపోతున్న స్నేహ

చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం తన కట్టుబొట్టు వంటివాటితో ప్రేక్షకులని బాగానే అలరించిన తెలుగు ప్రముఖ హీరోయిన్ స్నేహ గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి స్నేహ ఎప్పుడు కూడా ఓవర్ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ సెంటిమెంట్ ఓరియెంటెడ్ పాత్రలు మాత్రమే నటించి బాగానే ఆకట్టుకుంది.

ఈ క్రమంలో కింగ్ నాగార్జున, శ్రీకాంత్, విక్టరీ వెంకటేష్, వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. అయితే నటి స్నేహ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే నటి స్నేహ స్వతహాగా తమిళ భాషకు చెందిన నటి అయినప్పటికీ తెలుగులోనే తన చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తరుణంలో ప్రసన్న అనే తమిళ ప్రముఖ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

Leave a Comment