రీఎంట్రీ కోసం.. రెచ్చగొడుతున్న బాపు గారి బొమ్మ

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరోనా సమయంలో కన్నడ వ్యాపార వేత్త నితిన్ రాజుని వివాహం చేసుకున్న ఈమెకు ఇటీవల పాప పుట్టింది. ఆ పాపకి ఆర్న అని పేరు పెట్టారు. 

ఈ చేప కళ్ల సుందరి బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, రామయ్య వస్తావయ్యా… లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కన్నడలో కూడా చాలే సినిమాలు చేసింది ఆ అందాల ముద్దుగుమ్మ. కేవలం సినిమాలే కాదండోయ్ కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం చేసి తన మంచితనాన్ని చాటుకుంది. అంతే కాదండోయ్ నోరు లేని మూగ జీవాల కోసం కూడా ఆమె ప్రచారాలు చేస్తుంటుంది.

 

ఇప్పటివరకు ప్రణీత తన కూతురు కోసమే ఎక్కువగా సమయం కొటాయించి, అమ్మతనాన్ని ఆస్వాదించింది. ఇక ప్రణీత తన సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రీఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు కూడా మొదలెట్టేసింది. చాలా తర్వాత ఈ బ్యూటీ హాట్ గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ తిరిగి నటించొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రీఎంట్రీ తర్వాత ప్రణీత ఎలా రాణిస్తుందో చూడాలి. 

 Pranitha Subhash Latest

Leave a Comment