భార్యలను వదిలించుకోవడానికి కోట్లు వదులుకున్న హీరోలు వీరే..

సినిమాల్లో నటించే వారి పెళ్లిళ్లు జరుగుతుంటే వారి అభిమానులకు కూడా పండుగే. అతిరథ మహారథులు, అభిమానుల మధ్య వివాహం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఖర్చు ఎంతైన పర్వాలేదు తమ మ్యారేజ్ చరిత్రలో నిలిచిపోవాలని అనుకునేవాళ్లు ఘనంగా వేడుకను నిర్వహించుకుంటారు. అయితే కొందరు ఎంత ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకుంటారో.. ఎక్కువ కాలం కలిసుండలేక విడిపోతారు. ఇలా విడిపోయిన సమయంలోనూ భారీ ఖర్చుపెట్టి విడిపోతూ ఉంటారు. కొందరు నటులు తమ భార్యలను వదిలించుకోవడానికి కోట్ల రూపాయలైనా సరే చెల్లించడానికి ముందుకొచ్చారు. అంటే ఎంత కాస్ట్లీగా పెళ్లి చేసుకుంటారో.. అంతే కాస్ల్టీగా విడిపోతారన్నమాట. మరి అలాంటి నటుల గురించి తెలుసుకుందాం..

హృతిక్ రోషన్- సుస్సనే ఖాన్:
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గురించి తెలియని వారుండరు. ఈయన సుస్సనేఖాన్ ను 2000లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 2014లో విడాకులు తీసుకున్నారు. అయితే సుస్సనే ఖాన్ విడిపోయే ముందు హృతిక్ రోషన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు ఇతర అమ్మాయిలతో శారీరక సంబంధాలున్నాయని అన్నారు. ఈ సాకు చూపి 400 కోట్లు భరణంగా అడిగారు. అయితే హృతిక్ రోషన్ ఆ తరువాత మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఈమధ్య వీరిద్దరు మళ్లీ సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం.

ప్రభుదేవా- రమాలత:
సౌత్ ఇండియా మైకెల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా తన భార్య రమాలతకు 2011లో విడాకులు ఇచ్చారు. ఆ సమయానికి నయనతారతో ప్రేమలో ఉన్న ప్రభుదేవా రమాలతను విడిపించుకోవడానికి 25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, ఖరీదైన కార్లు, కొంత డబ్బు రమాలతకు ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆయన నయనతారను పెళ్లి చేసుకునేలేదు.

సంజయ్ దత్- రియా పిళ్లై:
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మొదటి భార్య రీచా శర్మ 1996లో మరణించింది. ఆ తరువాత 1998లో రియా పిళ్లైని సంజయ్ దత్ పెళ్లి చేసుకున్నారు. అయితే పదేళ్లు గడిచిన తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2008లో వీరు విడాకులు తీసుకున్ారు. ఈ సందర్భంగా సంజయ్ దత్ రియా పిళ్లైకి 8 కోట్ల రూపాయల భరణం చెల్లించారు. ఆ తరువాత దత్ మాన్య దత్ ను మూడో పెళ్లి చేసుకున్నారు.

అమీర్ ఖాన్-రీనా దత్:
అమీర్ ఖాన్ 1986లో రీనా దత్ ను ప్ేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని మనస్పర్థల కారణంగా 2000 సంవత్సంలో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించిన తరువాత విడిపోయినందున భరణం కింద రూ.10 కోట్ల వరకు తీసుకున్నారు. ఆ తరువాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వీరు కూడా విడిపోయారు.

సైఫ్ అలీఖాన్- అమృత సింగ్:
సైఫ్ అలీఖాన్, అమృత సింగ్ లు కలిసి ప్రేమలో పడ్డారు. ఆ తరువాత 1991లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు 2004లో విడాకులు తీసుకున్నారు. అయితే సైఫ్ నుంచి అమృత సింగ్ భారీగానే భరణం దక్కించుకుందట. ఆ తరువాత సైఫ్ అలీఖాన్ హీరోయిన్ కరీనాను పెళ్లి చేసుకున్నారు.

Leave a Comment