టాయిలెట్ కు వెళ్లందుకు చిటికెన్ వేలునే ఎందుకు చూపిస్తారు..?

చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో టాయిలెట్ కు వెళ్లాలనుకునేవారు చిటికెన వేలును చూపించేవారు. అర్జంట్ గా టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తే టీచర్ దగ్గర ఇలా సిగ్నల్ చూపించి పర్మిషన్ తీసుకుంటారు. అయితే చేతికి ఐదు వేళ్లు ఉండగా చిటికెన వేలును మాత్రమే ఎందుకు చూపిస్తారు..? అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. కానీ దీనికి సరైన సమాధానం ఇప్పటి రోజుల్లో చాలా మందికి తెలియదు. అయితే టాయిలెట్ కు వెళ్లేందుకు ఇలా చిటికెన వేలును చూపించడంలో ఓ ప్రత్యేక అర్థం ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ పురాణాల ప్రకారం ప్రతీ పనిలో ఓ శాస్త్రీయ కోణం ఉంటుంది. అలాగే టాయిలెట్ వెళ్లేందుకు చిటికెన వేలు చూపించడంలోనూ ఓ గూడార్థం దాగి ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం ఐదు మూలకాలు నీరు, ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరుగా చెప్పుకుంటారు. మన చేతికున్న ఐదు వేళ్లు ఐదు మూలకాలు సూచిస్తాయని అంటారు. బొటన వ్రేలు అగ్ని, చూపుడు వేలు గాలిని, మధ్యవేలు ఆకాశం, ఉంగరం వేలు భూమిని, చిటికెన వేలు నీటిని సూచిస్తాయి. మన శరీంలో నీరు శాతం ఎక్కువైనప్పుడు దానిని తొలగించేందుకు ఈ చిటికెన వేలును సిగ్నల్ గా చూపించేవారట.

అంటే ఒక వ్యక్తి తన శరీరంలో నీటి శాతం అధికమైనప్పుడు దానిని తొలగించేందుకు టాయిలెట్ చేస్తాడు. ఇది విద్యాభ్యాస సమయంలో పిల్లలకు చెప్పేందుకు ప్రతీ పాఠశాలలో ఈ సిగ్నల్ చూపించడం ప్రారంభించారు. అలా ప్రతీ విద్యార్థి టాయిలెట్ వెళ్లేందుకు చిటికెన వేలును సిగ్నల్ గా చూపిస్తాడు. అయితే ఇలా చిటికెన వేలును చూపించడం మన భారతదేశంలోనే కనిపిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా టాయిలెట్ వెళ్లడానికి ఇలా సిగ్నల్ ఇవ్వరు.

అయితే అమెరికాలో బీరును కొనుగోలు చేయడానికి మాత్రం చిటికెన వేలును చూపిస్తారు. అక్కడ పబ్బుల్లో, రెస్టారెంట్లల్లో సౌండ్ సిస్టమ్ అధికంగా ఉంటుంది. దీంతో ఒకరి వాయిస్ మరొకరికి వినిపించదు. దీంతో ఇలా చిటికెన వేలును చూపిస్తే అక్కడున్న వ్యక్తి బీర్ ఇస్తాడన్న మాట. అయితే చాలా మందికి మరొక డౌట్ ఉండొచ్చు. ఒంటికి అయితే చిటికెన వేలను చూపిస్తారు. మరి రెండికి రెండు వేళ్లు ఎందుకు చూపిస్తారు..? అని. వాస్తవానికి దానికి సమాధానం లేదు. అయితే కొందరు మాత్రం రెండు నిమిషాలు బయటికి వెళ్లొస్తా.. అని చెప్పడానికి ఇలా చూపిస్తారని అంటున్నారు.

Leave a Comment