షూటింగ్ కోసం వెళ్లి అండమాన్లో చిక్కుకున్న బాలకృష్ణ, కృష్ణ, కృష్ణం రాజు..: ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కృష్ణ ’ త్రయం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కృష్ణం రాజు, కృష్ణ, బాలకృష్ణ లు ఎవరికి వారే పోటీ పడి మరీ నటిస్తారు. అయితే సెపరేట్ గా వీరు స్టార్ హీరోలు. కానీ ఓ సినిమాలు వీరంతా కలిసి నటించారు. అదే సుల్తాన్. 1999లో వచ్చిన సుల్తాన్ సినిమాలో ప్రధానంగా బాలకృష్ణ నటించారు. హీరోగా, విలన్ గా నటించి మెప్పించారు. సైడ్ రోల్లో కృష్ణ, కృష్ణం రాజులు నటించారు. అయితే వారు అప్పటికే స్టార్ హీరోలయినందున వారి ఇమేజ్ కుతగ్గట్టుగా పాత్రలను కేటాయించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కృష్ణ, కృష్ణంరాజులు ఇరగదీశారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం అండమాన్ దీవుల్లోకి వెళ్లారు. అయితే వీరికి ఆహారం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ‘సుల్తాన్’ సినీ బృందం ఏం చేసిందో తెలుసా..?

బాలకృష్ణ సినిమాలంటే ఇష్టముండని వారెవరు ఉండరు. సుల్తాన్ సినిమా షూటింగ్ తీస్తున్న సమయంలో కొన్ని ఫొటోలు ముందే రిలీజ్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే హైప్ క్రియేట్ అయింది. డైరెక్టర్ శరత్, రచయితలు పరుచూరి బ్రదర్స్ కలిసి సినిమాను జాగ్రత్తగా తీశారు. ఎక్కడా మిస్టేక్ కాకుండా సినిమా పూర్తి చేశారు. అయితే అనుకున్న రేంజ్ లో సినిమా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇందులో నటించిన వారికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సిబ్బంది అనేక కష్టాలు పడ్డారట.

ఈ సినిమా షూటింగ్ కోసం అండమాన్ కు వెళ్లేందుకు సినీ బృందం రెడీ అయింది. అయితే ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాలని కృష్ణ త్రయం అనుకుంది. దీంతో ముగ్గురు కృష్ణలు కలిసి తమ ఫ్యామిలీస్ తో అండమాన్ వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన తరువాత సరైన సౌకర్యాలు లేవట. కేవలం రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ తప్ప ఎక్కడా స్టే చేయడానికి అవకాశం లేకుండా పోయిందట. దీంతో అందులోనే అందరూ అడ్జెట్ అయ్యారు. అంతేకాకుండా తిండి వస్తువులు కూడా దొరకలేదట.

చివరికి వారితో తెచ్చుకున్న బిస్కెట్లతోనే కాలం వెళ్లదీశారట. అయితే ఆ తరువాత మేనేజ్మెంట్ ఇతరులతో బియ్యం, కూరగాయలను తెప్పించారట. దీంతో విజయనిర్మల అందరికీ వంట చేసి పెట్టిందట. ఈ సమయంలో బాలకృష్ణ సముద్రంలో చేపలు వేటాడి తీసుకొచ్చారట. ఆ చేపలను విజయనిర్మల వండిపెట్టారు.అంతేకాకుండా ఎంతో రుచిగా ఉండడంతో అప్పటి వరకు పడ్డ కష్టమంతా మరిచిపోయారని చెప్పుకుంటారు.

Leave a Comment