చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు మొదటి సినిమాకు ఎంత తీసుకున్నారంటే..?

ఇప్పుడొచ్చే సినిమాల్లో నటించే వారికి రెమ్యూనరేషన్ కోట్ల రూపాయల వరకు ఉంటోంది. క్యారెక్టర్ ఆర్టిస్టులకు లక్షకు తక్కువ లేదు. మొదటి సినిమా అయిన వారి నటించినంతసేపు లెక్క గట్టుకొని పారితోషికం అందుకుంటున్నారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో నటించిన వారు మొదటి సినిమాకు రెమ్యూనరేషన్ అసలే తీసుకోలేదు. కొందరు మాత్రం చాలా తక్కువగా తీసుకున్నారు. వారి సినిమాలు హిట్టు కావడంతో రెమ్యూనరేషన్ పెరిగిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నుంచి నేటి జూనియర్ ఎన్టీ వరకు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో చూద్దాం..

చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా పునాది రాళ్లు. కానీ అంతకంటే మందే ప్రాణం ఖరీదు సినిమా విడుదలయింది. అయితే ఈ రెండు సినిమాలకు చిరంజీవ పారితోషికం తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన మనవూరి పాండవులు సినిమాలకు 1,116 రూపాయలు తీసుకున్నాడు. చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటించిన మొదటిసారిగా నటించారు.

కమలాసన్:
విలక్షణ నటుడు కమలాసన్ చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కలత్తూర్ కన్నమ్మ అయన మొదటి సినిమా. ఈ సినిమా చేసినందుకు రూ.500 తీసుకున్నాడు. ఆ తరువాత హీరోగా నటించిన సమయంలో 4,000 జీతంతో ప్రారంభించాడు.

మోహన్ లాల్:
మలయాళ నటుడు మోహన్ లాల్ మొదటి సినిమాకు రూ.2000 తీసుకున్నాడు. మంజిల్ విరింజ్ పుక్కల్ అయన మొదటిసారిగా నటించిన చిత్రం.

అజిత్:
తమిళ హీరో అజిత్ తొలి చిత్రం పాశమలర్ గళ్. ఈ సినిమా కోసం ఆయన 2,500 పారితోషికం అందుకున్నాడు

అమితాబ్ బచ్చన్:
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మొదటి సినిమా సౌత్ హిందుస్తానీ. 1969లో వచ్చిన ఈ సినిమా కోసం ఆయన రూ.5000 అందుకున్నాడు.

అమీర్ ఖాన్:
ఖయామత్ సే ఖయామత్ అనే సీనిమాతో అమీర్ ఖాన్ సినీ ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమా కోసం ఆయన 11,000 రూపాయలు తీసుకున్నాడు.

దీపీకా పదుకునే:
‘ఓం శాంతి ఓం’ అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా.. మొదటి సినిమాకు పారితోషికం తీసుకోలేదు.

విజయ్:
తమిళ ఇళయ దళపతిగా పేరు తెచ్చుకున్న విజయ్ చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకోసం ఆక్ష్న రూ.500 అందుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ 2001లో ‘నిన్ను చూడాలని’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించినందుకు 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

 

Leave a Comment