కారు వెనకాల LXI, ZXI, VXI ఉంటాయి.. వీటి అర్థమేంటి..?

ఒకప్పుడు రోడ్లపై ద్విచక్రవాహనాలు మాత్రమే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పడు కార్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దినాదినాభివృద్ధి చెందిన కొద్దీ కార్ల కొనుగోళ్లు పెరిగిపోతున్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం చిన్నపాటి కారు కొనుక్కుంటున్నారు. పెట్రోల్, డీజీల్ రేట్లు పెరుగుదలతో కుటుంబమంతా కలిసి టూర్ వెళ్లడానికి కారులో వెళితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావించి వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అయితే కారు కొనుగోలు చేసే ముందు బేసిక్ ఇన్పర్మేషన్ తెలిసి ఉండాలి. డ్రైవింగ్ తో పాటు కారుకు సంబంధించిన రూల్స్ ఫాలో కావాలి. అయితే చాలా మందికి కొన్ని ప్రత్యేక విషయాలు తెలియవు. అవేంటంటే..?

కారు అనగానే మనం కలర్, లోపల భాగం, చక్రాలను చూస్తాం. దానిని నడిపేవారు సీట్ కంపోర్ట్ ఉందా అని చూసుకుంటారు. అయితే కారు వెనకాల LXI, ZXI, VXI, అని ఇంగ్లీష్ లెటర్లు ఉంటాయి. వీటి గురించి ఎవరూ పట్టించుకోరు. అయితే వీటిని తెలుసుకోవాలనేది తప్పని సరి నిబంధన కాదు. కానీ అవగాహన కోసం ముందే తెలుసుకుంటే అది ఎలాంటి కారు తెలుసుకోవచ్చు. అప్పుడు ఇతరులు మనకు అబద్దాలు చెప్పినా గుర్తించవచ్చు. ఇంతకీ ఆ ఇంగ్లీష్ పదాల అర్థమేంటో తెలుసుకుందాం.

అంతకుముందు ఎక్కువగా డీజిల్ కార్లు ఉండేవి. కాలక్రమంలో పెట్రోల్ కార్లు ఎక్కువగా వినియోగంలోకి వస్తున్నాయి. అయితే అది పెట్రోల్ కారా..? డీజిల్ కారా..? అనేది మాములు వాళ్లు గుర్తించరు. కారు గురించి అవగాహన ఉన్నవారికి మాత్రమే తెలిసిపోతుంది. అయితే ఈ విషయాన్ని ఓ కోడ్ ద్వారా కారు వెనకాలు రాస్తారు. ఈ ఇంగ్లీష్ పదాలు పెట్రోల్ కారా..? డీజిల్ కారా..? అని తెలుపుతాయి. అంటే XI అంటే పెట్రోల్ ఇంజిన్ కారు అని అర్థం. ZI అంటే అది డీజిల్ కారు అని అర్థం.

ఇక LXI అంటే తక్కువ వేరియంట్ తో నడిచే పెట్రోల్ కారు. అంటే ఇది తక్కువ ఫీచర్లతో నడుస్తుంది. VXI అంటే రెండు లేదా మూడు ఫీచర్లతో నడిచే కారు అంటే మధ్యస్త రకం అన్నమాట. ఇక ZXI అంటే హై ఫీచర్లు కలిగిన కారు అని అర్థం. ఇది చాలా విలాసవంతమైన మోడల్ కారు అన్నమాట. అయితే ఇందులో ZXI+ కూడా ఉంటుంది. ఎక్కువ శాతం ఇలాంటి కారునే కొనుగోలు చేస్తారు. ఇలా ప్రత్యేకమైన గుర్తులతో అది ఎలాంటి కారో ఈజీగా తెలుసుకోవచ్చు.

Leave a Comment