ఆస్తి తగాదాల్లో తల్లిదండ్రులపై కేసులు పెట్టిన స్టార్లు వీరే..

ప్రతీ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యల్లేని కుటుంబం కాగడా పెట్టి వెతికినా కనిపించదు. అయితే కొందరు తెలివిగా తమ సమస్యలను పరిష్కరించుకొని ఆ విషయాలను బయటపడనీయరు. కానీ కొందరు చిన్న సమస్యకే పెద్దగా ఫీలవుతూ తీవ్ర మనోవేదన చెందుతారు.ఈ పరిస్థితి మాములు జనాలకైతే పర్వాలేదు. కానీ సెలబ్రెటీల విషయంలో జరిగితే మాత్రం మీడియాలో ఆ విషయం మారుమోగుతోంది. సినిమాల్లో అందచందాలను ప్రదర్శించే హీరోయిన్లలో కొందరు తెరవెనుక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అందరూ తమ సమస్యలను బయటపెట్టరు. కానీ కొందరుమాత్రం ఏకంగా కోర్టు మెట్లెక్కిన సందర్భాలున్నాయి. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే ఆ సమస్య కన్నవాళ్లతోనే రావడం గమనార్హం. మరి అలా కన్నవాళ్లపై కేసులు పెట్టిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం..

సంగీత:
ఖడ్గం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సంగీత ఆ తరువాత స్టార్ హీరోయిన్ అయింది. అయితే ఎక్కువకాలం సినిమాల్లో కొనసాగలేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’లో ఓ సాంగ్ లో మెరిసింది. సంగీత ఖడ్గం సినిమాలో తన తల్లి డబ్బుల కోసం సినిమా వాళ్లకు అప్పజెప్పిన సీన్ లో నటించారు. అయితే ఈ సీన్ తన రియల్ లైఫ్లో జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా తన సొంత తల్లిదండ్రులు తమ డబ్బుల కోసం హీరోయిన్ గా మార్చి తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించింది. ఆ తరువాత వారిపై కేసు పెట్టినట్లు పేర్కొంది.

కుష్భూ:
తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కుష్బూ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. అయితే కుష్భూకు తన తండ్రి మధ్య ఆస్తుల గొడవలు చాల జరిగాయి. దీంతో తండ్రిపై కేసు పెట్టింది. చివరికి నాకు అసలు తండ్రి లేడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

వనితా విజయ్ కుమార్:
ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్. ఈమె కూడా తెలుగులో ‘దేవి’ సినిమాలమలో భానుచందర్ కు జోడిగా నటించింది. అయితే వనితా విజయ్ కుమార్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. దీంతో తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని విజయ్ కుమార్ చెప్పడంతో వనితా కోర్టు మెట్లెక్కింది.

Leave a Comment