ఈ సీరియల్ నటీమణులు రోజుకు ఎంత తీసుకుంటారంటే..?

సినిమాల్లో అవకాశాల కోసం కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు జీవితమే మారిపోతుందని అనుకుంటారు. ఎందుకంటే మిగతా ఇండస్ట్రీల కంటే సినిమా పరిశ్రమలో వచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సకల సౌకర్యాలుంటాయి. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ పని చేసుకోవచ్చనే భావన ఉంటుంది. అయితే సినిమాల్లో నటించే వారికి లక్షలు,కోట్ల రూపాయల్లో పారితోషికం ఉంటుందని అందరికీ తెలుసు. మరి టీవీ సీరియళ్లలో నటించే వారికి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది..? ఎంత ఉంటుంది..? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అది క్లియర్ అయేందుకు కిందికి వెళ్లండి..

సినీ పరిశ్రమలో ఒక్కో సినిమాకు ఇంత పారితోషికం అని ప్యాకేజీ లెక్కన ఇస్తారు. ఒక్కో సినిమాకు ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ ఉంటుంది. అది ప్రతీ సినిమాకు మారే అవకాశం ఉంటుంది. అయితే సీరియల్ నటుల విషయానికి వచ్చేసరికి వారికి రోజున లెక్కన కట్టిస్తారు. వారి స్టార్ డమ్ ఆధారంగా రేట్ ఫిక్స్ చేసి చెల్లిస్తారు. సీరియల్ సక్సెస్ అయిన వారికి అగ్రిమెంట్ టైం దాటిని తరువాత రెమ్యూనరేషన్ పెంచుతారు. ఏయే నటీమణికి ఎంత రెమ్యూనరేషన్ ఉందో తెలుసుకుందాం..

ప్రేమి విశ్వనాథ్:
కార్తీక దీపం అనే ఒకే ఒక్క సీరియల్ తో స్టార్ నటిగా మారారు ప్రేమి విశ్వనాథ్. సౌత్ టీవీ ఇండస్ట్రీలో ఈ సీరియల్ కున్న ఆదరణ మరేదానికి లేదు. దీంతో ప్రేమి విశ్వనాథ్ రెమ్యూనరేషన్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఒక్క రోజుకు 30 వేల రూపాయలు తీసుకుంటుందట.

సుహాసిని:
మొదట్లో సినిమాల్లో నటించిన సుహాసిని ఆ తరువాత సిరీయల్స్ లో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆమె రోజుకు 25 వేల రూపాయలు తీసుకుంటోంది.

ఐశ్వర్య:
అగ్నిసాక్షి సీరియల్ లో నటించే ఐశ్వర్య రోజుకు రూ.25000 తీసుకుంటోంది.

నవ్యస్వామి:
రోజుకు 20000 తీసుకుంటున్న నవ్యస్వామి ‘నాపేరు మీనాక్షి’ అనే సీరియల్ తో గుర్తింపు పొందింది.

పల్లవి రామిశెట్టి:
ఈ నటి రోజులకు రూ.15,000 తీసుకుంటోంది. ఆడదే ఆధారం అనే సీరియల్ నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఆషికా:
కథలో రాజకుమారి అనే సీరియల్ తో గుర్తింపు పొందిన ఆషికా ఒక్కరోజుకు రూ.12000 తీసుకుంటోంది.

ప్రీతి నిగమ్:
సినిమాల్ల క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆ తరువాత సీరియల్ లో కొనసాగుతున్న ప్రీతి నిగమ్ రోజుకు 10,000 తీసుకుంటోంది.

మంజుల:
చంద్రముఖి సీరియల్ లో ప్రధానంగా కనిపించే మంజుల ఒక్కో రోజుకు 8 వేల రూపాయలు తీసుకుంటుంది.

Leave a Comment