చిరంజీవికి డూబ్ ఇతనా..? ఏ సినిమాల్లో నటించాడు..?

సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి చిత్ర పరిశ్రమకు చెందిన వారు రకరకాల ఫీట్స్ చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో ఒక సినిమాకు డైరెక్టర్, హీరో ప్రముఖంగా ఉంటారు. డైరెక్టర్ ఆలోచనలన్నీ హీరో చేయాల్సి వస్తోంది. సినిమా అద్భుతంగా రావడానికి తప్పని పరిస్థితుల్లో కొన్ని రిస్కీ సీన్స్ కూడా చేయాల్సి వస్తోంది. పూర్వంలో అలాంటి కొన్ని రిస్కీ సీన్స్ చేసి హీరోలు ప్రమాదంలో పడ్డారు. అలా ప్రమాదంలో పడకుండా ఉండడానికి రిస్కీ సీన్స్ లో హీరోకు డూబ్ ను పెడతారు. ఈ విషయం ప్రేక్షకులకు తెలియకుండా మేనేజ్ చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా దూకుడుతో సినీ ఇండస్ట్రీ గురించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ మానియా గురించి తెలియంది కాదు. ఆయన సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే. గతంలో చిరంజీవి సినిమా మొదటిరోజు చూడాలని ఎంతో మంది తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. ఎందుకంటే చిరంజీవి ఏ పాత్రలోనైనా ఇమిడిపోతాడు. సింగిల్ గానే కాకుండా డబులు, త్రిబుల్ రోల్ లో కూడా నటించి మెప్పించాడు మెగాస్టార్. అయితే చిరంజీవి ద్విపాత్రాభినయం ఎలా చేశారని సినిమా పరిశ్రమలో ఉన్నవారికి తప్ప మాములు జనాలకు అస్సలు అర్థం కాలేదు. అయితే చిరంజీవినే రెండు పాత్రలు చేశారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది కూడా.

తాజాగా మెగాస్టార్ గురించి ఓ సంచలన విషయం వైరల్ అవుతోంది. ఆయనకు ఓ వ్యక్తి డూబ్ గా నటించేవారని అంటున్నారు. డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ లో చిరును చూసి ఎంతో మురిసిపోయేవారు. కానీ కొన్ని రిస్కీ సీన్స్ లో మాత్రం చిరు కాకుండా మరో వ్యక్తి ఉండేవారని అంటున్నారు. అయితే ఆయన గురించి ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఈటీవీలో ప్రసారమవుతున్న ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షో నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి టాలెంట్ ఉన్న వ్యక్తులను బయటకు తీశారు. ఈ క్రమంలో చిరంజీవికి డూబ్ గా నటించిన వ్యక్తి వెలుగులోకి వచ్చాడు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని మార్టూరుకు చెందిన ప్రేమ్ కుమార్ పేరు ఇప్పుడు మారు మోగుతోంది. ఆయన 30 ఏళ్లుగా చిరంజీవికి డూబ్ గా నటిస్తున్నాడట. అచ్చం చిరంజీవిలా ఉండే ఈయన ఫొటో చూసి సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈయన ఏయే సినిమాల్లో నటించాడన్న విషయం మాత్రం బయటకు రాలేదు. మొత్తంగా సినీ పరిశ్రమలో హీరోలు చేసే మాయ గురించి ప్రేక్షకుల గురించి తెలియడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Leave a Comment