బ్రహ్మస్త్రం ఫుల్ రివ్యూ

గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు. ఈమధ్య అటువంటి సినిమాలు తగ్గాయనే చెప్పొచ్చు. సోషియో ఫాంటసీ సినిమాలకు క్రేజ్ ఉన్న నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో బ్రహ్మాస్త్రం సినిమా శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ప్రారంభం నుంచే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో రిలీజైన ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి ప్రజెంట్ చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..

నటీనటులు:
రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్, తదితరులు

సాంకేతికం:

డైరెక్టర్: అయాన్ ముఖర్జీ

నిర్మాతలు: మరిజ్కే డిసోజా, కరణ్ జోహార్, రణబీర్ కపూర్, నమిత్ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ

మ్యూజిక్ డైరెక్టర్: ప్రీతమ్ చక్రబోర్టీ

సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ, పంకజ్ కుమార్, మణికందన్, వికాస్ నైలాఖ

కథ:
పురాణాల నేపథ్యంలో సినిమా ప్రారంభం అవుతుంది. అన్నింటికి గురువైన బ్రహ్మాస్త్రం గురించి ఒకప్పుడు మునులు, బుుషులు యాగం చేస్తారు. దీంతో అనంత విశ్వంలో ఉన్న శక్తులు కిందికి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కో శక్తి అందిస్తుంది. ఆ శక్తులు వంశ పారంపర్యంగా వస్తాయి. అటువంటి వంశానికి చెందిన శివ(రణబీర్ కపూర్)కు ఆ శక్తులు అందుతాయి. అయితే కొందరు దుష్ట శక్తులు ఈ బ్రహ్మస్త్రను చేజిక్కిచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ శివ వారికి దక్కుండా పోరాడుతాడు. అయితే బ్రహ్మస్త్రతో పాటు మరికొన్ని అస్త్రాలను కూడా శివ కాపాడుతాడు.అయితే బ్రహ్మాస్త్రతో పాటు మిగతా అస్ట్రాలేంటి..? శివ వీటిని ఎలా కాపాడుతాడు..? అనేది పూర్తి కథాంశం

కథనం:
పురాణాల ఇథిహాసాలను ఆధారంగా చేసుకొని బ్రహస్త్రం సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా వీఎఫ్ఎక్స్ వాడడం వల్ల ప్రేక్షకులను ఆకుట్టుకుంటుందనే చెప్పొచ్చు. ఫస్టాప్ కాస్ట స్లో మోషన్లో వెళ్లినా.. సెకండాఫ్ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కాస్త బోర్ కొట్టించే సీన్లు ఉన్నాయనుకోవచ్చు. ఇక రణబీర్, ఆలియా భట్ ల మధ్య ఎప్పటిలాగే రోమాన్స్ సీన్స్ కు కొదవలేదు. మొత్తంగా సినిమాకు కష్టానికి తగిన ఫలితం రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎవరెలా చేశారంటే..:
రణభీర్, అలియా భట్ లు వారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎమోషన్ సీన్లలో రణబీర్ కాస్త తడడినట్లు తెలుస్తోంది. ఇక చాలా రోజుల తరువాత అమితాబ్ మరోసారి ఈ సినిమాలో కనిపించాడు. ఇప్పిటికీ ఆయనలో ఏమాత్రం యాక్టింగ్ స్పీడ్ తగ్గలేదనే చెప్పొచ్చు. మరో సీనియర్ నటుడు నాగార్జున తన స్థాయిక తగిన విధంగాయాక్ట్ చేశారు.

Leave a Comment