లోపల చెయ్యి పెట్టుకోవచ్చు.. నేను పట్టించుకోను..: గీతూ రాయల్

బిగ్ బాస్ 6 మొదటి వారం సందడి సాగింది. చాలా మంది కొత్త కంటెస్టెంట్లే అయినా వారి పరిధికి మించి పర్ఫామెన్స్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి కంటే మరొకరు పోటీగా టాస్క్ లను కంప్లీట్ చేయాలని తాపత్రపడుతున్నారు. అయితే టాస్క్ లను పూర్తి చేయాలన్న ఆత్రుతతో అసలు వారేం చేస్తున్నారో మరిచిపోతున్నారు. తాజాగా హౌస్ లో ఉన్న గీతూ రాయల్ రచ్చ రచ్చ చేసింది. టాస్క్ విషయంలో అబ్బాయిలో తనపై ఎక్కడ చేయి వేసినా పర్వాలేదంటూ హాట్ కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతకీ గీతూ రాయల్ ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణమేంటి..?

బిగ్ బాస్ కెప్టెన్ గా బాలాదిత్య ఎన్నికయ్యాడు. ఆయన కెప్టెన్ అయిన వెంటనే కొన్ని కండిషన్లు పెట్టాడు. వాస్తవానికి హౌస్ లో ఉన్న వారు కండిషన్లు పట్టించుకోరు. కానీ బాలాదిత్య మాత్రం తన మార్కును చూపించాలనుకుంటున్నాడు. హౌస్ లో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించొదద్దని, దురుసుగా మాట్లాడొద్దని రూల్స్ పెట్టాడు. అలా చేస్తే కచ్చితంగా పనిష్మెంట్ ఇస్తానని హెచ్చరించాడు కూడా. కానీ హౌస్ లో ఉన్న వారిలో బాలాదిత్య పెట్టిన కండిషన్లు ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

బాలాదిత్య వరస్ట్ ఫర్ఫామెన్స్ ఎవరో చెప్పండి.. అని అడిగిన సమయంలో కంటెస్టెంట్లు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఈ విషయంలో రేవంత్, ఆదిరెడ్డి మధ్య కాస్త వాదన జరిగింది. అయితే గీతూ రాయల్ కు సంబంధించి రేవంత్ కామెంట్ చేయాలనుకున్నాడు. ఆమె పీరియడ్స్ ఉన్న సమయంలో అలా పంపలేను అంటూ తనకు తానే వేసుకున్నాడు. అయితే బిగ్ బాస్ అది కుదరడు అనడంతో ఆదిరెడ్డి కూడా అదే చెబుతాడు. అప్పడు వీరిద్దిరి మధ్య వాదన జరుగుతుంది.

అయితే గీతూ రాయల్ నామినేట్ అయి జైలుకు వెళ్లడంతో ఆమెకు పడిన ఓట్లపై కొంతమంది ఆమె గేమ్ స్టాటజీ గురించి ప్రస్తావించారు. ఆమె గేమ్ సమంలో పిట్ ఉన్న నంబర్ కార్డులను తీసుకొని డ్రెస్ లోపల పెట్టుకునే ప్రయత్నం చేసింది. అది తప్పని చాలా మంది ప్రశ్నించారు. కానీ గీతూ రాయల్ మాత్రం అది గేమ్ స్టాటజీ అని చెప్పుకొచ్చింది. టాస్క్ విషయంలో నేను లోపల ఏమి పెట్టుకున్నా అబ్బాయిలు వాటిని నిరభ్యరంతరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే టాస్క్ లో అంతా ఒక్కటే అని గీతూ క్లారిటీ ఇవ్వడం సంచలనంగా మారింది.

Leave a Comment