ఎన్టీఆర్-వడ్డే నవీన్ బంధువులు: ఒకరికొకరు ఏమవుతారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బంధువులే ఉన్నారు. కానీ కొంత మంది గురించే ప్రేక్షకులకు తెలుసు. చాలా మంది అన్నదమ్మలు, బావ-బావమరుదలు.. ఇలా ఏదో వరుసతో బంధువులైనవారు చాలా మందే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్-వడ్డే నవీన్ గురించి. వీరిద్దరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. కానీ వీరిద్దరు బావ -బావమరుదులు అవుతారన్న విషయం చాలా మందికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందే వడ్డే నవీన్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ వీరిద్దరు వరుసకు ఎలా బంధువులవుతారు..? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ విషయమేంటో తెలసుకుందాం..

ఒకప్పుడు లవ్ సినిమాల్లో కేవలం వడ్డే నవీన్ మాత్రమే కనిపించేవారు. అందుకే అతన్ని లవర్ బాయ్ అని పిలిచేవారు. 1997లో ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నవీన్ ఆ తరువాత పెళ్లి, మనసిచ్చిచూడు, తదితర లవ్ సినిమాల్లో నటించారు. ఇక కొన్ని రోజుల తరువాత ట్రెండ్ మారడంతో ఫ్యామిలీ సినిమాల్లో మెరిశాడు. ఆయన నటించింది కొన్ని సినిమాలే అయినా అందులో సగం వరకు సక్సెస్ అయినవే అని చెప్పాలి. ఇక ఆయనకు అవకాశాలు రాని సమయంలో సినిమాల నుంచి తప్పుకున్నారు. చివరగా ఆయన ‘శత్రువు’, ‘ఆదిలక్షి’ అనే సినిమాల్లో కనిపించాడు.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు నవీన్. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు. సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన రామకృష్ణ కుమార్తె అమ్మాయి. వీరిద్దరు ప్రేమలో పడ్డ విషయం పెద్దలు తెలిపారు. అయితే ఇలా పెద్దలకు తెలపడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని వార్తలు వచ్చాయి. వీరి ప్రేమ విషయాన్ని జూనియర్ స్వయంగా పెద్దలకు తెలిపాడట. ఎందుకంటే వడ్డేనవీన్, ఎన్టీఆర్ స్నేహితులు కావడమే.

మొత్తానికి వారి పెళ్లి జరగడంతో ఎన్టీఆర్, వడ్డే నవీన్ బావ బావమరుదులు అయ్యారు. అయితే ఎన్టీఆర్ ఎంతో కష్టపడి వీరి పెళ్లి చేసినా.. ఫలితం లేకపోయింది. ఎందుకంటే వడ్డే నవీన్, అతని భార్య మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఆమెతో విడాకులు తీసుకున్నా వడ్డే నవీన్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో సన్నిహితంగానే ఉంటున్నారట. సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అయినందున ఆ విషయాన్ని పట్టించుకోకుండా కలిసిమెలిసి ఉంటున్నారని చిత్ర పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.

Leave a Comment