మల్లెపూలు పెట్టుకోవడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి..?

పూలల్లో రాణి మల్లె. మల్లెపూలు ఇష్టపడని మహిళ ఉండదు. కొందరు పురుషులు కూడా మల్లెపూల సువాసనతో పరిమళించిపోతారు. ఒక ప్రత్యేక కాలంలో ఎక్కువగా వచ్చే మల్లెలను తలలో పెట్టుకోవడానికి ప్రతీ మహిళ ఇష్టపడుతుంది. అంతేకాకుండా దేవుడికి దండ వేయడానికి ఎక్కువగా మల్లెలను మాత్రమే వాడుతారు. అందుకే వీటిని దేవుడి పూలు అనికూడా పిలుస్తారు. సాధారణ రోజుల్లోనే కాకుండా ప్రత్యేక రోజుల్లోనూ మల్లెలను వాడడానికే ప్రయత్నిస్తారు. మిగతా పూలల్లో కంటే మల్లెల్లో సువాలన ఎక్కువ. మనసుకు ఆహ్లాదాన్ని పంచే గుణం మల్లెలో మాత్రమే ఉంటుంది. అయితే మల్లెపూలను ధరించిన వాళ్లు ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటారట.. ఎందుకంటే..?

శోభనం రాత్రి పడక గదిని మల్లెలలో అలంకరిస్తారు. ఆ రాత్రి ఎంతో బాగుండాలనే ఇలా చేస్తారు. అత్యంత సువాసన ఇచ్చే మల్లెలను ఫస్ట్ నైట్ రోజు అలంకరించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యం ఏర్పడుతుంది. మొదటి రాత్రి ప్రశాంతంగా ఉంటే వారు జీవితాంతం ఇలాగే కలిసి ఉంటారని మల్లెలను అంకరిస్తారని అంటారు. పురుషుడిని ఆకర్షించే గుణం మల్లెలకు ఎక్కువగా ఉంటుంది. ఇవిచ్చే సువాసనతో మనసులో ఎదో తెలియని అనుభూతి ఏర్పడుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది.

పూర్వ కాలంలో ఎక్కువ మంది మల్లెలను ధరించేవారట. ఎందుకంటే వాటి సువాసన వల్ల తల్లి నుంచి బిడ్డకు ఎక్కువగా పాలు ఉత్పత్తి అవుతాయట. నిద్రలేమితో బాధపడేవారికి మల్లెలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. గుప్పెడు మల్లెపూలు తల దిండు పక్కన పెట్టుకొని పడుకుంటే మంచి నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక దీర్ఘ శ్వాసతో వీటి సువాసనను పీల్చడం ద్వారా మనసును ఉల్లాసపరుస్తుందని తెలుపుతున్నారు. మనసిక వ్యాకూలత, డిప్రెషన్ తో బాధపడేవారు వీటి సువాసవన పీల్చాలని అంటున్నారు. అతి కోపంతో బాధపడేవారు కూడా మల్లెల స్మెల్ ను చూసి ప్రశాంతంగా ఉండవచ్చని అంటున్నారు.

ఇలా మల్లెలు తలలో పెట్టుకోవడం ద్వారా అందాన్ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయని అంటున్నారు. అయితే మల్లెపూలు వేసవి కాలంలో మాత్రమే లభిస్తాయి. అందువల్ల మల్లెలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఆస్వాదించాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. నేటి కాలంలోకొందరు ఫ్యాషన్ కు అలవాటు పడి అసలు పూలు పెట్టుకోవడమే మానేస్తున్నారు. కానీ మల్లెపూలు ధరించడం వల్ల మరింత అందంగా కనిపిస్తారని చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇవిచ్చే ఆరోగ్యం గురించి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.

Leave a Comment