భర్తకు ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేసిన భార్య..

ఈ సృష్టిలో భార్యభర్తల బంధం పవిత్రమైంది. ఒక్కసారి మూడుముళ్లు పడితే జీవితాంతం ఆ వ్యక్తులు కలిసుండాలని ఆయా సాంప్రదాయాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం పెళ్లి చేసుకున్న ఓ జంటలో మరొకరికి అస్సలు చోటు లేదు. అంతేకాకుండా ఏ మహిళ అయినా తన భర్త ఏం చేసినా సహిస్తుంది.. కానీ మరో స్త్రీతో సంబంధాన్ని పెట్టుకోవడం అస్సలు సహించదు. కానీ ఇక్కడ ఓ భార్య తన భర్తకు మరో మహిళతో దగ్గరుండి మరీ పెళ్లి చేయించింది. అంతేకాకుండా ఓ భర్త, ఇద్దరు భార్యలతో వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఇంకో అమ్మాయికి కట్టబెట్టాల్సిన అవసరం ఆమెకు ఎందుకు వచ్చింది..? అసలు కథ ఏంటి..?

ఈ స్టోరీ ఏ సినిమాలోదో.. మరే దేశంలో జరిగింది కాదు.. ఆంధ్రప్రదేశ్లోనే జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీలోని తిరుపతిలోని డక్కిలి అంబేద్కర్ నగర్ కు చెందిన కళ్యాణ్ టిక్ టాక్ వీడియోలు చేస్తే ఫేమస్ అయ్యాడు. కొన్నేళ్ల కిందట ఆయన విమల అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందే వీరిద్దరు ప్రేమించుకొని ఆ తరువాత జీవితాంతం కలిసుండేందుకు ఒక్కటయ్యారు. కొన్నిరోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ విమల తన భర్త మనసు బాగా లేకపోవడం గమనించింది. ఈ విషయంపై ఆరా తీయడంతో అసలు విషయం గ్రహించింది.

కళ్యాణ్ అంతకుముందే నిత్యాశ్రీ అనే అమ్మాయిని ప్రేమించాడు. టిక్ టాక్ వీడియోలు చేస్తుండగా వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తరువాత వీరు పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వీరు పెళ్లి చేసుకోవడం కుదరలేదు. దీంతో కళ్యాన్ విమలను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో విమల నిత్యాశ్రీ కోసం ఆరా తీయడం మొదలు పెట్టింది.

ఇంతలో నిత్యాశ్రీనే విమలను కలుసుకుంది. కళ్యాణ్ ను తనతో ఇచ్చి పెళ్లి చేయాలని అడిగింది. దీంతో షాక్ తిన్న విమల కొన్ని రోజుల పాటు తీవ్రంగా ఆలోచించింది. చివరికి వారి ప్రేమను అర్థం చేసుకొని కళ్యాన్, నిత్యాశ్రీల వివాహాన్ని ఒప్పుకుంది. ఆ తరువాత విమల వారి పెళ్లిని సాంప్రదాయంగా దగ్గరుండి మరీ చేయింది. అంతేకాకుండా వీరు ముగ్గురు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. జీవితాంతం తాము కలిసుంటామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment