కృష్ణంరాజు సంస్మరణ సభలో లక్షమందికి సరిపోయే టన్నుల కొద్దీ ఆహారం: అవేంటంటే..?

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవలే స్వర్గస్తులైనారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆయన వారసుడు ప్రభాస్ ఇప్పటికీ తీవ్ర దు:ఖంలో మునిగారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు. తమ గ్రామానికి చెందిన సినీ హీరో మరణించారన్న వార్త ఆ గ్రామ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. దీంతో ఆయన గుర్తులను మననం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయన సంస్మరణ సభను సొంత గ్రామంలో నిర్వహించాలని కృష్ణం రాజు వారసుడు ప్రభాస్ నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు లక్షలాది మంది ఫ్యాన్స్ హాజరయ్యారు. వీరి రాకను ముందుగానే గ్రహించిన కృష్ణం రాజు ఫ్యామిలీ ఫుడ్ మెనూను భారీగా ఆర్డరిచ్చింది. టన్నుల కొద్దీ వంటకాలను తయారు చేయించింది.

వరుసగా సినీ నటులు మృతి చెందడం సినీ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. అలనాటి స్టార్ హీరో కృష్ణం రాజు కొన్ని రోజుల కిందట అనారోగ్యంతో మరణించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న రెబల్ స్టార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే వార్త తెలియగానే ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన వారసుడు హీరో ప్రభాస్ ఇప్పటికీ షాక్ లోనే ఉన్నారు. అయితే కృష్ణం రాజు సంతృప్తికర జీవితాన్ని అనుభవించారు. కానీ ఆయన చేయాల్సిన పనులు కొన్ని మిగిలే ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ ఆ భారాన్నీ మీదేసుకోనున్నారు. ఈ తరుణంలో ఆయన సంస్మరణ సభ జరిగి జ్ఒపకాలను గుర్తు చేరసుకున్నారు.

కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహిస్తారనే వార్త తెలియగానే ఫ్యాన్స్ అక్కడిగి భారీగా చేరుకున్నారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన వంటకాలపై చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ రాకను ముందుగానే ఊహించిన ప్రభాస్ ఫ్యామిలీ సంస్మరణ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసేలా ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల మాంసం కర్రీలను తయారు చేసింది. ఈ మెనూను చూసి అక్కడికి వచ్చిన వారు షాక్ తిన్నారు. ఇంతకీ మెనూలో ఏముందంటే..?

6 టన్నుల మటన్ బిర్యానీ, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 6 టన్నుల మటన్ కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, 1 టన్ను రొయ్యల ఇగురు, ఒక టన్ను స్టఫ్ట్ క్రాబ్, ఒక టన్ను రొయ్యల గోంగూర ఇగురు, ఒక టన్ను బొమ్మిడాయల పులుసు, 2 లక్షల బూరెలు. ఇలా మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలను తయారు చేయించారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంస్మరణ సభకు హాజరయ్యారు. అయితే ఈ వంటకాలను చూసి అక్కడికి వచ్చిన వారు నివ్వెరపోయారు.

Leave a Comment