ఎన్టీఆర్ పెళ్లి కట్నం ఎంత తీసుకున్నాడో తెలుసా..? అప్పుడు వారి ఏజ్ చిన్నదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ వెరీ స్పెషల్. నందమూరి వంశం నుంచి వచ్చానా.. ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరుతపులిలా ఎప్పుడూ యాక్టివ్ ఉండే ఎన్టీఆర్ సినిమాల కోసం కొందరు ఎదురుచూస్తుంటారు. తాను నటిస్తున్నాని తెలియకుండా.. తనకు ఇచ్చిన పాత్రలో జీవిస్తాడు. అంతకుముందు కేవలం సినిమాలకే పరిమితమైన జూనియర్ ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. ఆయన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పెళ్లి సమయంలో ఎంత కట్నం తీసుకున్నారనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ వివాహ సమయంలో జూనియర్ భరణం కింద ఎం అందుకున్నారంటే..?

తెలుగు చిత్ర సీమలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. బాలనటుడిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొదట్లో ఎన్టీఆర్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ రాజమౌళి తీసిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో జూనియర్ తన ప్రతాపాన్ని చూపించాడు. తనలోని నవరసాలను ఈ సినిమా ద్వారా బయటపెట్టాడు. అప్పటి నుంచి నేటి వరకు తారక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఎన్టీఆర్ ను స్టార్ చేసిన రాజమౌళి ఆయనతో మూడు సినిమాలు తీశాడు. రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

జూనియర్ పర్సనల్ విషయానికొస్తే ఆయనకు 2011 మే 6వ తేదీన ఆయన లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్నారు. అప్పటికీ నందమూరి కుటుంబంలో ఒకరిగా సాగుతున్న ఆయనకు మాజీ సీఎం చంద్రబాబునాయుడే అమ్మాయిని చూశారని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా దగ్గరుండి మరీ పెళ్లి చేయించారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడైన నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మి ప్రణతి. ఈయనకు పలు చోట్ల భారీగా ఆస్తులు ఉన్నాయి. తన కూతురికి ఓ స్టార్ ను ఇచ్చి పెళ్లి చేస్తున్నందున ఆయన భారీగానే ముట్టజెప్పాడు. వీరి వివాహ సమయంలో 250 కోట్ల విలువైన భూములను ఇచ్చారని సమాచారం. అంతేకాకుండా మరికొన్ని చోట్ల కూడా విలువైన భూములను అందించారని అంటారు. మొత్తం కలిపి 1200 కోట్ల ఆస్తిని అప్పజెప్పారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ వివాహ సమయంలో మైనర్ ను పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం జరిగింది. కానీ ప్రణతి అప్పటికే మేజర్. కొందరు జూనియర్ అంటే గిట్టని వాళ్లు ఇదంతా ప్రచారం చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు. వీరు వివాహం చేసుకొని 12 సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పటి వరకు అన్యోన్యంగా జీవించిన వీరికి ఇద్దరు కొడుకులు. ఎన్టీఆర్ ను అర్థం చేసుకునే వదిన దొరికిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Leave a Comment