నిర్మలమ్మ యువతిగా ఉన్న ఫొటోలు వైరల్ ఎంత బాగున్నారో

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు సమానమైన గుర్తింపు ఉంది. హీరోయిన్ గా రాణించకపోయినా కొందరు సైడ్ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లిగా.. అత్తగా… బామ్మగా ఎన్నో సినిమాల్లో నటించిన నిర్మలమ్మను ఆనాటి సినీ ప్రేక్షకులు ఎవరూ మరిచిపోరు. అగ్రహీరోలందరితో నటించిన ఈమె పాత సినిమాల్లో హీరోయిన్. అయితే కొంతకాలం సినిమాలకూ దూరంగా ఉన్న ఆమె ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అవార్డులు సైతం గెలుపొందారు. 2009లో మరణించిన నిర్మలమ్మను దాదాపు మరిచిపోయారు. కానీ ఆమెకు సంబంధించిన చిన్న నాటి ఫొటోలు ఇప్పడు వైరల్ గా మారాయి. ఆ ఫొటోల స్టోరీ ఏంటంటే..?

నిర్మలమ్మ 1920 జూలై 18న జన్మించారు. ఆమె యుక్త వయసులో ఉండగా నాటకాలంటే పిచ్చి ఉండేది. కానీ ఇంట్లోవారు మాత్రం ఒప్పుకోలేదు. అయితే ఆమె పెద్దనాన్న చొరవతో నాటకాల్లో పాత్రలు వేశారు. ఈ క్రమంలో 1943లో ఆమె 16వ ఏట గరుడ గర్వభంగం అనే సినిమాలో ఎంట్రి ఇచ్చారు. ఇందులో చెలికత్తెగా కనిపించి ఆకట్టుకుంది. అలా ఈ సినిమాతో మొదలైనా ఆమె ప్రయాణం నిరంతరం సాగించింది. మొత్తంగా వెయ్యి చిత్రాలకు పైగా సినిమాల్లో నటించారు.

ఆమె సినీకెర్లో ఎందరో మహా నటులతో కలిసి పనిచేశారు. నేటి తరం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎక్కువ సినిమాల్లో కనిపించారు. ఆమె జీవితంలో బాగా పేరు తెచ్చిన సినిమాలు మయూరి, సీతారామరాజు. మయూరి చిత్రంలో డ్యాన్స్ చేయాలని తనపపడే మనువరాలికి నిర్మలమ్మ బామ్మగా నటించారు. సీతారామరాజు సినిమాలో ప్రతికూల పాత్రతో అదరగొట్టారు. ఈ రెండు సినిమాల్లో నటనకు ఆమెకు నంది అవార్డులు లభించాయి.

చివరిసారిగా చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ సినిమాలో కనిపించారు. ఆ తరువాత మళ్లీ సినిమాలో కనిపించని నిర్మలమ్మ 2009 ఫిబ్రవరి 19న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. బామ్మ క్యారెక్టర్ కు గుర్తింపు తెచ్చిన నిర్మలమ్మ స్థానాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ భర్తీ చేయలేదు. అయితే ఇటీవల ఆమె యంగ్ గా ఉన్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆమె యంగ్ గా ఉన్నప్పుడు నాటకాలు వేశారు. ఆ సందర్భంలో దిగిన ఫొటోలు కొందరు బయటకు తీశారు. వాటిని సినీ ప్రేక్షకులు వైరల్ చేసేస్తున్నారు.

Leave a Comment